Suryaa.co.in

Telangana

గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి

– గద్దరన్న అంటే ఒక విప్లవం. ఒక వేగుచుక్క
– తెలంగాణఅభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి
– ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
– ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే
– మీకు ఏం కావాలో నాకు చెప్పండి
– ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
– తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964 లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం.

భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. మీకు ఏం కావాలో నాకు చెప్పండి… రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో నేనుంటా. ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా.

ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుంది. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తాం.

గద్దరన్న అంటే ఒక విప్లవం. ఒక వేగుచుక్క. గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా. తెలంగాణఅభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

తొలి పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర కి అందించారు. పైడి జైరాజ్ గురించి పుస్తకాన్ని సైతం ఆయన రచించారు.

మణిరత్నం, సుహాసిని, మురళీ మోహన్, జయసుధ, జయప్రద, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, నివేదా థామస్, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు.

ఐ లవ్ యూ సుకుమార్: అల్లు అర్జున్

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం. నాకు ఈ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి , కోమిటిరెడ్డి వెంకట రెడ్డి కి ధన్యవాదాలు. సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్.

స్పెషల్ థ్యాంక్స్ రాజమౌళి కి చెప్పాలి. ఆయనే కనుక పుష్ప 1 ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ అవార్డ్. ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా ఫ్యాన్స్ కు డెడికేట్ చేస్తున్నాను. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి, ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు థ్యాంక్స్. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి ఏడాది ఈ వేడుక జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై తెలంగాణ”

గద్దర్ అవార్డ్సు విజేతలు వీరే..

ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ గేయ రచయిత అవార్డు: చంద్రబోస్ ( రాజు యాదవ్ )

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు: అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి 2898 AD)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు: నల్లా శ్రీను ( రజాకార్ )

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు: విశ్వనాధ్ రెడ్డి(గామి)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు : అధ్నితిన్ జిహాన్ చౌదరి( కల్కి 2898 AD)

ఉత్తమ ఎడిటర్ అవార్డు : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ కథా రచయిత అవార్డు : శివ పాలమడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి )

ఉత్తమ కొరియోగ్రఫర్ అవార్డు: గణేష్ ఆచార్య (దేవర)

ఉత్తమ కమెడియన్ అవార్డు: సత్య , వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు: చంద్రశేఖర్ రాథోడ్ ( గ్యాంగ్ స్టార్ )

ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు :శ్రేయ ఘోషల్ ( పుష్ప 2 .. సూసేకి సాంగ్ )

ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు : సిద్ శ్రీరామ్ ( ఊరి పేరు భైరవ కోన.. నిజమేనే చెప్తున్నా సాంగ్ )

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు: భీమ్స్ సిసిరోలియో( రజాకార్ )

ఉత్తమ ఫిమేల్ సపోర్టింగ్ అవార్డు: శరణ్య ప్రదీప్ ( అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ )

ఉత్తమ మేల్ సపోర్టింగ్ అవార్డు : SJ సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ బాలల చిత్రం అవార్డు: 35 చిన్న కథ కాదు

ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు: ఆయ్

ఉత్తమ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు: అరుణ్ దేవ్( 35 చిన్న కథ కాదు), హారిక(మెర్సీ కిల్లింగ్)

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ అవార్డు: రజాకార్

ఉత్తమ జ్యూరీ అవార్డు : దుల్కర్ సల్మాన్ ( లక్కీ భాస్కర్)

స్పెషల్ జ్యూరీ అవార్డు: పొట్టేలు (అనన్య నాగళ్ల )

స్పెషల్ జ్యూరీ అవార్డు: క ( సుజీత్, సందీప్ )

స్పెషల్ జ్యూరీ అవార్డు : రాజు యాదవ్ (రాజేష్ కళ్లేపల్లి)

జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా ర్యాప్ సాంగ్ )

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అవార్డు: కమిటీ కుర్రాళ్లు

ఉత్తమ తృతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు: లక్కీ భాస్కర్

ఉత్తమ ద్వితీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు: పొట్టెల్

ఉత్తమ చిత్రం అవార్డు: కల్కి 2898 AD

ఉత్తమ దర్శకుడు అవార్డు: నాగ అశ్విన్ (కల్కి 2898 AD)

ఉత్తమ నటి అవార్డు: నివేదా థామస్( 35 చిన్న కథ కాదు)

ఉత్తమ నటుడు అవార్డు : అల్లు అర్జున్ (పుష్ప 2)

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ

పైడి జైరాజ్ అవార్డు: మణిరత్నం

 కాంతారావు ఫిల్మ్ అవార్డు : విజయ్ దేవరకొండ

BN రెడ్డి ఫిల్మ్ అవార్డు : సుకుమార్

 నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు

రఘుపతి వెంకయ్య అవార్డు : యండమూరి వీరేంద్ర నాధ్

 

LEAVE A RESPONSE