Suryaa.co.in

Telangana

విత్తన పత్తి కంపెనీలకు అమ్ముడు పోయిన గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు

– దళారులకు అండగా నిలిచి పేద సీడుపత్తి రైతుల పొట్ట కొడుతున్నారు
– బీ ఆర్ ఎస్ నేత కురువ విజయ్ కుమార్ .

గద్వాల: రైతు కమీషన్ ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వెళ్తున్న సీడు పత్తి రైతులను అడ్డుకొని పోలీసుస్టేషన్ కు తరలించి అక్రమ కేసులు నమోదు చేశారు. సీడు పత్తి రైతులకు అన్యాయం చేసే విదంగా కాంగ్రెస్ నాయకులు,సీడు ఆర్గనైజర్లు,అధికారులు వ్యవహరిస్తున్నారు.

సీడు పత్తి పేరుతో జరుగుతున్న మోసాలను రైతు కమీషన్ దృష్టికి తీసుకుని వెళ్లకుండా సమస్య ఉన్న ధరూర్,మల్దకల్,గట్టు ,KT దొడ్డి మండలాల్లో జరగాల్సిన కమీషన్ పర్యటన ను సంబందం లేని పూటాంపల్లి గ్రామానికి మార్చారు. ముందస్తు పథకం ప్రకారం కమీషన్ ను పక్కదారి పట్టించేవిదంగా వ్యవహరించారు.

సీడు పత్తి కంపినీలు,ఆర్గనైజర్లు ఒక ముఠాగా ఏర్పడి సీడు పత్తి రైతులు వారు పండించిన పంటను పాస్ అయినప్పటికీ ఫెయిల్ చేస్తూ రైతులను మోసం చేసిన సీడ్ కంపినీలపై ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని ఈనెల 10 వ తేదీన హైద్రాబాద్ లో రైతు కమీషన్ కు పిర్యాదు చేస్తే మా పిర్యాదుకు స్పందించి, ఈరోజు రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాకు వస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు సీడు పత్తి రైతుల సమస్యను పక్కదారి పట్టించే విదంగా కాంగ్రెస్ పార్టీ కార్యాక్రమంలాగా కాంగ్రెస్ పార్టీ జెండాలను,కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ర్యాలీ లాగా చేసి రైతులను మోసం చేస్తున్నారు.

సీడు పత్తి రైతులకు న్యాయం చేయాలనీ రైతు కమీషన్ దగ్గర కు వెళితే అక్రమంగా అరెస్టు చేసి ధరూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న దౌర్జన్యానికి వ్యతిరేకంగా, రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతున్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించింది
ఈరోజు గద్వాల జిల్లా పూటన్‌పల్లి గ్రామంలో కమిషనర్ కోదండ రెడ్డి పర్యటించనున్న సందర్భంలో, నష్టపోయిన రైతులను కలిపించి వారికి న్యాయం చేయించాలనే ఉద్దేశంతో నేను రైతులను అక్కడికి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. రైతుల బాధలు చెప్పకుండానే, సమస్యలను వినకుండానే, అన్యాయంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనం.

LEAVE A RESPONSE