Suryaa.co.in

Telangana

5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే

-బీజేపీ ఒక్కటే లంకె బిందె
-కేసీఆర్ ఐదేళ్లు విశ్రాంతి తీసుకోవాలి
-మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు తమ చేతగాని తనాన్ని పరుష పదజాలంతో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ కంటే తాము తక్కువ కాదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం హామీల కుప్పలను చేస్తోంది. 5 వందలకు గ్యాస్.. వట్టి గ్యాసే.. మొన్న ఫోటో సెషన్ మాత్రమే చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు.

2 వందల యూనిట్లకు ఉచిత కరెంట్ అన్నారు.. తప్పితే అమలు కావడం లేదు. పథకాల పేరుతో జీఓలు విడుదల చేస్తున్నారు తప్పితే ఒక్కటి అమలు కావడం లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ వచ్చాక ఎండలు పెరిగాయి, బోర్లలో నీళ్లు ఎండిపోయాయి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కష్టాలు వచ్చాయి. రాహుల్ గాంధీ ప్రధాని కారు.. ఆరు గ్యారంటీలు అమలు కావు. కాంగ్రెస్ ఖాళీ బిందె.. బీఆర్ఎస్ చిల్లులు పడిన బిందె. బీజేపీ ఒక్కటే లంకె బిందె.. 17ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.

తెలంగాణలో కేంద్రం 9 లక్షల 36కోట్ల క్యాపిటల్ ఇన్విస్ట్ మెంట్ పెట్టింది. తెలంగాణలో ఆస్తుల విలువ పెరిగింది.. అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి ఎప్పుడూ డిల్లీ వెళ్లిన, ముగ్గురు వెళతారు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. బీఆర్ఎస్ గల్లీలో లేదు.ఢిల్లీలో లేదు. కేసీఆర్ ఐదేళ్లు విశ్రాంతి తీసుకోవాలి.

LEAVE A RESPONSE