– త్వరలోనే బీసీ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ రథయాత్ర
హైదరాబాద్: తెలంగాణ బీసీ జేఏసీ కన్వీనర్ గా డాక్టర్ గటిక విజయ్ కుమార్ ను నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ లో గురువారం నియామక పత్రం అందించారు.
వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన విజయ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.
సీనియర్ జర్నలిస్టు అయిన విజయకుమార్ పలు సామాజిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని అశోక హోటల్ లో తెలంగాణ బీసీ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం పై చర్చ జరిగింది.
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడంతోపాటు చట్టసభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు సాధించి రాజ్యాధికారంలో వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే బీసీ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ రథయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకోసం జిల్లా నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్ అని కూడా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.