– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్రావు డిమాండ్
పరవాడ : ఫార్మా పర్సనల్ కి గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్ల పై ఫార్మా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వెంటనే ఫార్మా పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు డిమాండ్ చేశారు. గురువారం పరవాడ సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో శంకర్రావు మాట్లాడారు.
ఫార్మా పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తుపాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. జనరేటర్ల పై ఫార్మా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించడం వలన యూనిట్ విద్యుత్తు 9 రూపాయల నుండి 30 రూపాయలు ఖర్చవుతుంది అని దీనికి తోడు ట్రంప్ సుంకాలు వలన ఫార్మా పరిశ్రమలు నష్టాలు పాలవుతే కొన్ని చిన్న పరిశ్రమలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన విద్యుత్తు సరఫరా లేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి అన్నారు. ఇప్పటికే అనేక పరిశ్రమలు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని కార్మికులకు కార్మికుల ఆవేదన గురవుతున్నారన్నారు.
వెంటనే ప్రభుత్వం విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వివి శ్రీనివాసరావు, ఫార్మాసిటీ స్టాఫ్ ఎండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.