జనసేనాని ఔదార్యం

Spread the love

* పలువురికి చెక్కులు అందజేసిన పవన్ కళ్యాణ్
* గిరిజనులతో కలిసి నృత్యం….

యువశక్తి సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పలువురికి సహాయం చెక్కులను అందజేశారు. అంధుల క్రికెట్ లో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లోని నలుగురు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున సహాయం చేశారు. క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి తో పాటు టీమ్ లోని మరో ముగ్గురు ఉత్తరాంధ్ర క్రికెటర్లు దుర్గారావు, ఎ. రవి, వెంకటేశ్వరరావు సహాయం పొందిన వారిలో ఉన్నారు.

మువ్వల నగేష్ కుటుంబానికి చేయూత
2021 జనవరిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి మువ్వల నగేష్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ అందజేశారు. నగేష్ హత్య ఉదాంతాన్ని ఆయన తల్లి సుందరమ్మను అడిగి తెలుసుకున్నారు. హత్య వెనుక ఎవరు ఉన్నా కచ్చితంగా చట్టానికి పట్టించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పారు.

అక్షర రమణకు సాయం
చీపురుపల్లికి చెందిన ఆసియా యూత్ ఫౌండేషన్ సభ్యుడు, సంచార గ్రంథాలయం నడుపుతూ వేలాది మందికి జ్ఞానాన్ని పంచుతున్న రెడ్డి రమణకు జనసేన పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అందజేశారు. గ్రామాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ఆ సొమ్ము ఖర్చు చేయాలని పవన్ కళ్యాణ్ రెడ్డి రమణకు సూచించారు.

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు….
ఇటీవల వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల మూడు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం చెక్కులు అందించారు. ఇచ్చాపురానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యురాలు కె. కృష్ణవేణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులకుimage-2 చెక్కు అందజేశారు. ఎలమంచిలికి చెందిన మరో క్రియాశీలక సభ్యుడు ఎం. చిట్టిబాబు ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు బీమా చెక్కు అందజేశారు. అలాగే టెక్కలికి చెందిన సాయి కృష్ణ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు బీమా చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన పవన్ కళ్యాణ్
యువశక్తి సభా వేదికపై గిరిజన సంప్రదాయ నృత్యం చేస్తున్న కళాకారులతో కలిసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నృత్యం చేశారు. యువశక్తి సభ వేదికపై ఆసీనులైన పవన్ కళ్యాణ్ ని కళాకారులు నృత్యంimage-1 చేయాలని కోరడంతో వారితో కలిసి కాసేపు సరదాగా ఆడారు. ఆప్యాయంగా వారితో ఫోటోలు దిగారు.

Leave a Reply