పవన్‌ చేసేది రాజకీయ వ్యభిచారం కాక మరేమిటి…?

– పూటకో పార్టీతో మూడు ముక్కల రాజకీయం పవన్‌దే
– పవన్‌ కళ్యాణ్‌ యువశక్తి సభ వల్ల ఎవరికి ప్రయోజనం.?
– ఆత్మస్థుతి, పరనింద తప్ప సభలో ఏమీ లేదు
– ప్రభుత్వాన్ని, జగన్‌ గారిని తిట్టడానికే సభ పెట్టినట్లున్నాడు
– యువత కోసం అనేది మిధ్య…
– వ్యావహారిక భాషలో పవన్ కళ్యాణ్ తిరుగుబోతు
– నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు
– నువ్వూ, చంద్రబాబు కలిసి నడిపిన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..?
– ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా…ఆరాటమా..?
– నీ వేదికపై నువ్వు చెప్పిన రజక, నాయూ బ్రాహ్మణ వంటి కులాలు వారు ఎక్కడా..?
– జగన్‌ గారి చేతిలో రెండో సారి కుక్కచావు చావలేను
– గ్లాసుతో టీ తాగి ఫ్యాన్‌కి ఓటేశారని కార్యకర్తలనే నమ్మనంటున్నాడు
– నాకు భయం లేదని అన్ని సార్లు చెప్పాడంటే భయపడుతున్నట్లే
– కాపులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణే
– నీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై వెంట్రుక కూడా ఊడదు
– రోజా ధైర్యంగా పోరాడి రెండు సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా చేస్తోంది
– నువ్వు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయావు…అదీ నీ స్థాయి
– నీ ఇంట్లో ఆడవారు సినిమాల్లో నటించడం లేదా..?
– నా దగ్గర కూడా రెండు చెప్పులు ఉన్నాయ్‌…నేను కూడా తీయగలను
– రాజశేఖరరెడ్డి పంచెలో పోగునైనా కదిలించగలిగావా..?
– నేను చంద్రబాబు సంకలోకి ఎక్కుతున్నా అని చెప్పడానికే ఈ సభ: మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)

ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి నింపుతానని, ప్రభుత్వానికి సూచనలు చేస్తానని ఓ నెల రోజుల నుంచి చెప్తూ చెప్తూ ఈ రోజు సభ ప్రారంభించాడు. 12 గంటల నుంచి కుర్రాళ్లను వేచిఉంటే రాత్రికి ఆత్మస్థుతి, పరనింద పారాయణం చేశాడు. తన సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం, జగన్‌ గారిని, ప్రభుత్వాన్ని బూతులు తిట్టడం తప్ప ఆ సభలో ఏమీ లేదు.లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి, చర్చిల్, లెనిన్, స్టాలిన్, మావో…ఇలాంటి పెద్ద పెద్ద వాళ్లు విమర్శిస్తే తట్టుకుంటాడట. తనది వాళ్లంతటి గొప్పటి వ్యక్తిత్వం చెప్పుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే కుసంస్కారంతో కూడిన భావప్రకటనా స్వేచ్ఛ కలిగిన దిగజారిన మనిషి పవన్‌ కళ్యాణ్‌.మైకు దొరికిందని, మూడు నాలుగు వేల మంది ముందు కూర్చున్నారని, టీవీలన్నీ చూపిస్తాయని ఏదేదో వాగుతున్నాడు. ఏరా ఓరే అంటూ మాట్లాడటం కుసంస్కారం కాక ఏమంటాడు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను అసభ్య పదజాలంతో మాట్లాడటం, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం తప్ప ఆ సభ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.చివరికి వచ్చిన జనసేన కార్యకర్తలకు కూడా ఆ సభ వల్ల ఉపయోగం లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి సినిమా పిచ్చితో నమ్మి అక్కడకు వచ్చిన వారినికూడా తానున నమ్మను అంటాడు.ఇదెక్కడి దౌర్భాగ్యం..? నిన్ను నమ్మి నీలాగే అన్నా వదినలను సతాయించినట్లు, వారి అమ్మానాన్నలను సతాయించి అంత దూరం నుంచి అక్కడకు వస్తే మీరు నన్ను నట్టేటా ముంచేస్తారు అంటాడు.

నా కులపోడు, చుట్టం, స్నేహితుడంటూ మీరు వేరే వారికి ఓటు వేస్తారు అంటూ వారిని తిడతాడుసరే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనంటే మీరు ఎలాగూ ద్వేషిస్తారు..చివరికి నిన్ను నమ్మి వచ్చిన వారిని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్‌రెడ్డి గారంటే ఆయనకు ఎంత ద్వేషం, అసూయ, ఈర్ష లేకపోతే మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటాడా.?సొంత పార్టీ ఒకటి పెట్టి బీజేపీ, టీడీపీతో అంటకాగింది నువ్వే…తూచ్‌ అని చంద్రబాబు, ఆయన కొడుకును బూతులు తిట్టి రెండో ముక్కగా అంటకాగింది ఆయనే. ఇప్పుడు మూడో ముక్కగా చంద్రబాబుతో తయారుగా ఉన్నాడు…ఇక మూడు ముక్కల రాజకీయం చేసేది పవన్‌ కళ్యాణే.ఎవరో సినిమా కవులో, డైరెక్ట.ర్లో రాసిచ్చిన డైలాగులు చదివే నువ్వు జగన్‌ గారి గురించి సంధి ప్రేలాపణలు మాట్లాడుతున్నాడు.నువ్వు చేసే దాన్ని రాజకీయ వ్యభిచారం అనక ఏమంటారు..?ఒక పక్క బీజేపీతో మైత్రి బంధం అంటాడు…పక్కచూపులు, కన్ను కొట్టుడు, కాలు గీటుడు చంద్రబాబుతో..దీన్ని రాజకీయ వ్యభిచారం అనక మరేమంటారు..? మోడీ గారి వద్ద నాకు పిలుపు వచ్చి ఎనిమిదేళ్లయ్యింది అని ఆ రోజు అన్నావ్‌.ఇప్పుడేమీ మీవల్లే మోడీ వద్ద నా పలుకుబడి అంటున్నావ్‌…అప్పుడు సత్తా లేదా..?పూటకో మాట రోజుకో మాట…నోటికి ఏదొస్తే అదిమాట్లాడుతున్నాడు.ఈ రకమైన బరితెగింపు రాజకీయాలు చేసే వ్యక్తి దేశంలో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే.

ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా…ఆరాటమా..?
2014 నుంచి 19 వరకూ చంద్రబాబు, నువ్వు కలిసి ప్రభుత్వం నడిపారు కదా…ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పాలి.ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌ ని నిత్యం తిడుతూనే ఉన్నావ్‌.అధికారం లేకపోయినా ఏదైనా చేయొచ్చు అన్న నువ్వు…మరి ఉద్దానాన్ని ఎందుకు ఉద్దరించలేకపోయావో చెప్పాలి.చంద్రబాబు హయాంలో మత్స్యకారులు కనిపించలేదా..? జెట్టీ కట్టించాలని అప్పుడు తెలియలేదా..? ఆ ఐదేళ్లు నువ్వు చేసింది పోరాటమా…ఆరాటమా..? అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌ ఎందుకు కట్టించలేదు.ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అక్కడ ఫిషింగ్‌ హార్బర్‌ కట్టిస్తున్నాడు..పనులు జరుగుతున్నాయి.నువ్వు కలలు కంటుంటే ఆల్‌ రెడీ పనుల్లోకి వెళ్లిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి . కాపులను, మత్స్యకారులను, బీసీలను మోసం చేసి కులాలు లేవని మాట్లాడుతున్నాడు.

నీ వేదికపై రెండు కులాల వారే ఎందుకు ఉన్నారు..?
రాజకీయం అంతా మూడు కులాలు మధ్యనే తిరుగుతోంది అంటున్న నువ్వు నీ వేదికపై మీ ముగ్గురే ఎందుకున్నారు..? ఇద్దరు కాపులు, ఒక కమ్మ తప్ప ఒక రజకుడు దొరకలేదా..? మీటింగుకే కొప్పుల వెలమలా…? మీటింగుకే ఇతర కులాలా..?మీరు లేచి వారిని ఎందుకు కూర్చోబెట్టలేదు..కుర్చీలు వేసే మనసు కూడా మీకు రాలేదు. చంద్రబాబు నువ్వు ఏం మాట్లాడుకున్నారో రాష్ట్రమంతా తెలుసు. దానికి ఇంటిలిజెన్స్‌ వారిని అడగాల్సిన అవసరం లేదు.రెండు రాజకీయ పార్టీల అధ్యక్షులు కూర్చుంటే దేశం బాగోగుల గురించి కలదా మాట్లాడుకోవాల్సింది.మనం బీజేపీతో అంటకాగి ఐదేళ్లు ప్రజల్ని మోసం చేశాం అని మాట్లాడుకోవాలి కదా? అంబటి రాంబాబు గురించి 27 నిమిషాలు, ఐటీ శాఖ మంత్రి గురించి 38 నిమిషాలు మాట్లాడుకున్నారట. హోం మంత్రి గురించి 22 నిమిషాలు మాట్లాడుకున్నారట.ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయాలు ఏముంటాయి?నా అంత ధైర్యవంతుడు లేడు అంటాడు… చంద్రబాబునాయుడు ఇంట్లో టీ పట్టుకొస్తే కప్పులు పట్టుకెళ్లే వ్యక్తి వెళ్లే వరకూ మాట్లాడుకోలేదు అన్నావు కదా?మీరు మాట్లాడుకునే రహస్యాలు బయటికి వెళ్లిపోతాయి అనే భయం మీకు.మళ్లీ నేను ధీరోదాత్తుడిని, ధైర్య వంతుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు.

జగన్‌ చేతిలో రెండో సారి కుక్కచావు చావలేనని స్పష్టంగా చెప్పాడు
పవన్‌ కళ్యాణ్‌ ధైర్యంగా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. కార్యకర్తలను నమ్మలేనని, వాళ్లు ఓటేయరని చెప్పాడు.వీరమరణం మళ్లీ చావలేనని, రెండో సారి చస్తే కుక్క చావు అవుతుందనే నిజం చెప్పాడు.ఈ మీటింగు మాత్రం నేను మళ్లీ చంద్రబాబు సంకలో చేరుతున్నాను అని చెప్పడానికి పెట్టాడు. జగన్‌ చేతిలో ఒక సారి బడిత పూజ అయిపోయింది. రెండో సారి కూడా కుక్క చావు చావడం దేనికని చంద్రబాబు సంక ఎక్కుతున్నాను అని చెప్పాడు.ఊగటం, ఆగటం ఉత్తరాంధ్రలో పవన్‌ నేర్చుకున్న విద్యే అది.
చంద్రబాబుకు తనకు ఒక అత్తతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, దత్తతండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో అనే పవన్‌ కళ్యాణే చెప్తున్నాడు. మళ్లీ జగన్మోహన్‌ రెడ్డి నీ గురించి నిజం చెప్తే మళ్లీ ఉలుకుపడతాడు.

వ్యావహారిక భాషలో పవన్ కళ్యాణ్ తిరుగుబోతు
సామాన్య జనం మాట్లాడుకునేటటువంటి తెలుగు బాష వ్యాప్తి చెందడానికి ఉద్యమం చేసిన గిడుగు రామ్మూర్తి, గురజాడ ఇద్దరూ ఇంట్లో భార్య ఉండగా పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్న వారిని తిరుగుబోతు అన్నారు.

మరి తిరుగుబోతులకు జై కొట్టాలి..బ్యానర్లు కట్టాలన్నపుడు…
చంద్రబాబు, సోనియా గాంధీ ఇద్దరూ అక్రమ సంధితో తప్పుడు కేసులు పెట్టారని ప్రజలు నమ్మారు కాబట్టే ఈ రాష్ట్రానికి నాయకుడిగా జగన్మోహన్‌రెడ్డి గారిని ఎన్నుకున్నారు.నువ్వు ఇంకా చంద్రబాబు మత్తులోనే ఉంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు.ఈ రాజకీయ నాయకులు అంటాడు…మరి నువ్వేవెవరివి…రాజకీయ నాయకుడివి కాదా..?ఏటా వంద కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసి సినిమాలను వదిలేసి వచ్చాను అన్నావ్‌… జగన్మోహన్‌రెడ్డి మీరు మంచిగా పరిపాలనను అందించండి…నేను సినిమాలు చేసుకుంటాను అని నువ్వే అన్నావ్‌.చెప్పినమాట ప్రకారం సినిమాలు చేసుకుంటున్నాడు.25 కోట్లు టాక్స్‌ కడుతున్నాను అంటే మీ సంపాదన ఎంత..? ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు..? సినిమాకు మీరు తీసుకునేది యాభై కోట్లు కదా…దాంట్లో వైట్‌ ఎంత తీసుకుంటున్నారు.. ముస్లింలు ఉంటే అబ్దుల్‌ కలాం వల్లే రాజకీయాల్లోకి వచ్చానంటాడు..బ్రాహ్మణులు ఉంటే పీవీ నరసింహరావు వల్ల అంటాడు. ఇప్పుడు రణస్థలం వెళ్లి గిడుగు రామ్మూర్తి స్ఫూర్తితో వచ్చానంటాడు..అది నోరా..ఇంకేమన్నానా..?

గ్లాసుతో టీ తాగి ఫ్యాన్‌కి ఓటేశారని కార్యకర్తలనే నమ్మనంటున్నాడు
గ్లాసుతో టీ తాగారు పోలింగ్‌ బూత్‌ కి వెళ్లి ఫ్యాన్‌కి ఓటేశారు అంటాడు…ఈ బాధ పగవాడికి కూడా వద్దురా బాబూ.సభ మొత్తంలో 13 సార్లు నాకు భయం లేదు అన్నాడు…భయం లేదు అని చెప్పుకోవాలా…?జగన్‌రెడ్డి అంటూ నువ్వు కూడా చేతి దగ్గరకు వచ్చి మాట్లాడు.చంద్రబాబు కొడుకును కూడా చేతికందేట్లు వెళ్లి తిట్టావా..? మొన్న చంద్రబాబును కలిసినప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడలేదు?

ప్రమాణ స్వీకారం దేనికి సామీ..? ముఖ్యమంత్రికా…మంత్రికా..ఎమ్మెల్యేకా…?
మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 175 సీట్లకు పోటీ చేయాలి కదా..
నువ్వే కుక్క చావు చస్తున్నానని నీ నొటితోనే చెప్తున్నావు…చంద్రబాబు సంకనెక్కితే కానీ ఏడవలేను అంటున్నావ్‌.మరి ముఖ్యమంత్రి ఎవరు…? నిన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి చంద్రబాబు ఒప్పుకోడు కదా..పోనీ చంద్రబాబు వద్ద మంత్రి చేస్తావా..? లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటివి చేస్తావా…అసలు నీ ఆలోచన ఏంటి..?ఎవర్నో అర్కెస్త్రాలను తీసుకొచ్చి మాట్లాడించడం వల్ల నీ ముందు కూర్చున్న కుర్రాళ్ల వద్ద పలుచన కావడం తప్ప వేరేది కాదు.ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు అడ్డగోలుగా దోచుకున్న చంద్రబాబునాయుడి పంచన చేరి ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నాడు.

కాపులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కళ్యాణే
కాపుల్ని ఏవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే అది నువ్వే పవన్‌ కళ్యాణ్‌.నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే నీతో సెల్ఫీలు దిగేవాడెవ్వడు..? నాకు చిరంజీవి గారంటే విపరీతమైన పిచ్చి…అలాంటి వ్యక్తి దగ్గరే నేను సెల్ఫీ దిగలేదు…నీతో ఎందుకు దిగుతారు..?నువ్వు మాతో సెల్ఫీలు దిగాల్సిందే తప్ప మా వాళ్లు ఎవరూ నీతో సెల్ఫీ దిగరు.నువ్వు నటుడివి కదా…యాక్షన్‌ చేస్తూ మాట్లాడతావు…ముందు కాగితం పెట్టుకుని చత్వారం కళ్లజోడు పెట్టుకుని చదివేస్తూ జగన్‌గారికి నీతి కబుర్లు చెప్తున్నావ్‌.

చివర్లో జేబులోంచి తీసి చదివింది హైదరాబాద్‌ కవులు రాసిచ్చిన స్క్రిప్టేగా…ప్రింట్‌ తీసుకుని జేబులో పెట్టుకున్నావా..?ఇంతకీ ఈయన బీజేపీతో ఉంటాడా…? టీడీపీతో ఉంటాడా..? అందరితో కలిపి ఉంటాడా అనే స్పష్టత లేదు.తప్పుడు కేసుల్లో ఇరుక్కుని, మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన వారికి సెల్యూట్‌ కొట్టడం గర్వపడే అంశం.వ్యక్తత్వం లేకుండా గిడుగు రామ్మూర్తి చెప్పిన తిరుగుబోతుకు సెల్యూట్, జిందాబాద్‌ కొట్టడం దారుణం.

నీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై వెంట్రుక కూడా ఊడదు. ఇతని భావదారిద్యంతో దిగజారి మా పార్టీ వారిని ఎన్ని తిట్టినా నీ నోటి తీట తీరుతుందేమో కానీ…జెండా మోసే వైఎస్సార్సీపీ కార్యకర్త చిటికెనవేలిపై ఉన్న వెంట్రుకకు కూడా ఊడదు. ఒక సినిమా మాజీ నటి, ఒక కళాకారురాలిని సినిమాల్లో నటించిందని ఎంత దిగజారి మాట్లాడావు…? మీ ఇంట్లో ఆడవారు సినిమాల్లో నటించలేదా..? వారి పట్ల కూడా ఇదే అభిప్రాయమా..? సినిమాల్లో నటిస్తున్న ఆడవారిపై నీకున్న కుసంస్కారం, తప్పుడు బుద్ధి ఈ రోజు సభాముఖంగా స్పష్టమైంది.నీ మనసులో ఉన్న భావాన్ని, వ్యక్తిత్వాన్ని భయటపెట్టావ్‌…ఇదంతా సమాజం చూస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.

రోజా ఏం తప్పుడు పనిచేసింది..? సినిమాల్లో నటిస్తే చులకనా..? మీ ఇంట్లోకూడా నటిస్తున్నారు కదా నీ వయసంతా…నీ పక్కన నటిస్తున్న వారి వయసెంత..?వేదికలెక్కితే పెద్ద పెద్ద మాటలు…చివరికి కుసంస్కారమా..?తోటి ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడే నిన్న మా వాడివి అని చెప్పుకోడానికే సిగ్గేస్తుందిరోజా దమ్ముగా రెండు సార్లు జనంలో గెలిచింది. నీలాగా రెండు చోట్లా ఓడిపోలేదు. దమ్ముగా పదేళ్లు శాసన సభ్యురాలిగా చేసి ఈ రాష్ట్రాన్ని మంత్రిగా చేస్తోంది. సిగ్గు శరం లేకుండా ఆడవారి గురించి నీచంగా మాట్లాడతావా..? సత్యానందం గారి దగ్గర డైలాగులు ఒక్కటే కాదు…కాస్త వ్యక్తిత్వాన్ని కూడా నేర్చుకో. జనసేన జెండా మోసే కార్యకర్తలను నేను నమ్మడం లేదు…నేను చంద్రబాబుతో వెళ్లిపోతున్నాను…టాటా గుడ్‌ బై అని చివరిగా చెప్పాడు నేను చంద్రబాబు సంకలో ఎక్కినా కూడా మీరంతా నన్ను నమ్మండి అంటున్నాడు

ఇప్పటికైనా ముసుగు తీసినందుకు ధన్యవాదాలు
పవన్‌ కళ్యాణ్‌ ఇన్నాళ్లకు ఒక మంచి పనిచేశాడు..ముసుగు తీసి తాను చంద్రబాబు మనిషినని స్పష్టం చేశాడు.ఇక నుంచైనా ఆయన నోటి జాడింపు మానుకుంటే మంచిది..మానుకోకపోతే నా దగ్గర కూడా రెండు చెప్పులు ఉన్నాయ్‌…నేను కూడా తీయగలను.నా చేతికి అందేట్లు వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వారి గురించి మాట్లాడు..సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు, చెడిపోయిన వ్యక్తత్వంతో నాయకుడిగా ఫోజులు కొట్టడం మానుకో.

రాజశేఖరరెడ్డి పంచెలో పోగునైనా కదిలించగలిగావా..?
2009 ఎన్నికల్లో మహానేత వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం చేసేప్పుడు పంచె ఊడిపోయింది కదా…దాన్ని ఊడదీసింది ఈయనేనా..?ఏం పొడిచాడు…? 2014 వరకూ అడ్రస్‌ లేడు..రాజశేఖరరెడ్డి గారు కట్టుకున్న పంచె దారపు పోగును కూడా టచ్‌ చేయలేవు… నేను లేస్తే మంచోడిని కాదు అని సొల్లు చెప్పడం తప్ప ఇతను ఏం చేయగలిగాడు..రాజశేఖరరెడ్డితో నువ్వు చేసిన పోరాటం ఏంటి..? మైకు ముందు రెండు మాటలు మాట్లాడితే పోరాటం చేసినట్లా..? రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌కి వచ్చిన దిక్కుమాలిన ఖర్మ ఎవరికైనా వస్తుందా..? ఇన్ని సార్లు గోడదూకడం ఎవరి వల్లైనా అవుతుందా..?మీటింగుకు వచ్చిన జెండా మోసే కార్యకర్తలో స్థైర్యాన్న నమ్మకాన్ని కలగజేయాల్సిన బాధ్యత నాయకుడిది. నువ్వు గెలిచినా ఓడినా నీతో ఉంటామని వచ్చిన వారిని నేను మిమ్మల్ని నమ్మడం లేదని చెప్తున్నాడు. ప్రశ్నించడం నీ ఒక్కవల్లే అవుతుందా..? మేమూ ప్రశ్నించగలం. నువ్వు అందరినీ బూతులు తిడతావ్‌…నిన్ను మాత్రం సార్‌..ఆయ్యా అనాలా..? అంతా బిల్డప్‌ బాబాయ్‌ కాకపోతే పవన్‌ కళ్యాణ్‌ ఎవరితో యుద్ధం చేయలేదు..

Leave a Reply