తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్లో భాగంగా మరొక విద్యార్థిని సహాయం అందింది. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మిత్రులు వంగ రాజేశ్వర్ రెడ్డి ఈ రోజు బధిర విద్యార్థిని అర్చనకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్చన 9 వ తరగతి చదువుతుంది.
చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు అవసరమైన ఇయరింగ్ మిషన్ కోసం అవసరమైన నిధులను అందించేందుకు సిద్దిపేటకు చెందిన రాజేశ్వర్రెడ్డి ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రగతి భవన్ లో విద్యార్థిని అర్చనకు ఈ మేరకు మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు. విద్యార్థిని అర్చనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రాజేశ్వర్ రెడ్డి ని మంత్రి కేటీఆర్ అభినందించారు.