– స్పెషల్ పోలీస్ లను కూడా ఇదే విదంగా వేదించారు
– కొంతమంది కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు.వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్దరిస్తారు,వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారు అనుకున్న. కానీ నిన్న 79 రూపాయల జీతం పెంచి 1000 రూపాయల జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారు. 79 రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగింది.
మేము అధికారంలో వచ్చినప్పుడు 9 వేల జీతం ఉండేది. ప్రతి సంవత్సరం 1000 రూపాయల జీతం పెంపు ఉంటుంది అని చెప్పామ్. 20 వేల జీతం పెంచడం జరిగింది. తరువాత వారికి పీఆర్సీ 30 శాతం పెంచడం జరిగింది. హోమ్ గార్డుల జీతాలు పెంచిన ఘనత మా నాయకుడు కేసీఆర్ మాత్రమే. ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ,అన్ని విభాగాల్లో విధులు నిర్వర్తించే వారు.ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ లలో పని చేసే వారికి 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది.
పోలీస్ లతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక లివ్ లు కూడా ఇవ్వడం జరిగింది. వారిని రెగ్యులరైజ్ చేయాలని రాజీవ్ త్రివేది నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిన విషయం అందరికి తెలుసు. వాళ్ళను ఈ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ లుగా నియామక ప్రక్రియ చేస్తారు అనుకున్నాం.
ఆనాడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఈ హోమ్ గార్డులు పర్మనెంట్ చేస్తారు అన్నారు. ఏమైంది మరి. చనిపోయిన వారికి కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇస్తారు అనుకున్నాం. మేము డిమాండ్ చేస్తున్న స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ లు అని వారిని పర్మనెంట్ చేయండి. చనిపోయిన హోమ్ గార్డులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వండి.
రిటైర్ అయిన హోమ్ గార్డులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి. పోలీసులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోమ్ గార్డులకు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. హోమ్ గార్డుల నియామకాలు వెంటనే చేపట్టాలి. ఉద్యోగులకు డిమాండ్లు పరిస్కారం చేయాలి.హోమ్ గార్డులకు వారి అసోసియేషన్ ఉండాలి అని డీజీపీ కార్యాలయంలో రూమ్ ఉండాలని చెప్పడం జరిగింది.ఇప్పుడు రూమ్ తాళాలు ఇవ్వడం లేదు
హోమ్ గార్డులను వేధిస్తే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా వారికి అండగా ఉంటాం. 79 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పెంచామని అంటే ఊరుకునేది లేదు స్పెషల్ పోలీస్ లను కూడా ఇదే విదంగా వేదించారు.కొంతమంది కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు.వాళ్ళను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. న్యాయమైన డిమాండ్లు పరిస్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.