దేవుడే గెలిచాడు!

ఒక పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కలిగిన ఓ పేద స్త్రీకి ఆలిండియా రేడియోలో సహాయం కోసం అర్ధించే అవకాశం కల్పించారు.

ఆమె తనకు సాయం చేయమని కోరుతూ ఆ భగవంతుడు ఖచ్చితంగా ఎవరో ఒక దాతను పంపిస్తాడన్న విశ్వాసం వ్యక్తం చేసింది.అది విన్న ఓ నాస్తిక ధనవంతుడు ఆమెకు దేవుడిపై గల విశ్వాసాన్ని అవహేళన చేద్దామని సంకల్పించాడు.

వెంటనే పెద్ద హోటల్ నుంచి ఆ కుటుంబానికి సరిపడా భోజనం తెప్పించి తన మనిషి ద్వారా ఆమె ఇంటికి పంపాడు.వెళ్ళే ముందు తన మనిషితో ఇలా అన్నాడు “ఆమె భోజనం ఎవరు పంపారని అడిగితే దెయ్యం పంపిందని చెప్పమ”ని..ఆ మనిషి ఆ పేదరాలి ఇంటికి వెళ్లి భోజనం పాకెట్లు ఇచ్చాడు.ఆమె వాటిని అందుకుని ధన్యవాదాలు చెప్పింది.అప్పుడు మనిషి
“ధన్యవాదాలు చెప్పావు సరే..మీకు భోజనం ఎవరు పంపారని అడగవా” అన్నాడు.

దానికి ఆ ఇల్లాలు సావధానంగా ఇలా అంది..
“ఆ సమాచారంతో నాకు పనిలేదు..దేవుడు ఆదేశిస్తే దెయ్యమైనా చేస్తుంది..”
అక్కడే..అప్పుడే దైవంపై నమ్మకం మరోసారి గెలిచింది..వికృత ఆలోచన తలదించింది.!

– సురేష్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply