– మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు
అనంతరపురం జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తితిదే ఛైర్మన్ కోసమే రాయదుర్గంలో వేంకటేశ్వరస్వామి కళ్యాణ ముహూర్తం మార్చి అపచారం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి , కాలువ శ్రీనివాసులు ఆరోపించగా.. దీన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తోసిపుచ్చారు. ఈ విషయమై రాయదుర్గం వెళ్తున్న కాలువను ఒడ్డుపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.నిరసనగా తేదేపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
రాయదుర్గంలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ ముహూర్తం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ వేడుకకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన రాక ఆలస్యమైనందుకు స్వామి కళ్యాణ ముహూర్తం మార్చి అపచారం చేశారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. దీన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తోసిపుట్టారు.
కల్యాణోత్సవంలో అపచారం జరగ లేదని.. సమయానికే కళ్యాణం జరిపించామని జవాబిచ్చారు.అయితే అపచారం జరిగినట్లుగా ఆలయానికి వచ్చి నిరూపిస్తానని కాలవ శ్రీనివాసులు సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఆయన అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తుండగా ఆత్మకూరు మండలం, ఒడ్డుపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.స్టేషన్ కు రావాలని
పోలీసులు చెప్పడంతో నోటీసు ఇవ్వకుండా తనను స్టేషన్‌కు ఎలా పిలుస్తారని కాలవ ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా తేదేపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.