Home » గోదావరి నది జలాలను కాలుష్యం నుంచి పరిరక్షించాలి

గోదావరి నది జలాలను కాలుష్యం నుంచి పరిరక్షించాలి

సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్
గోదావరి నది జలాలను కాలుష్యం కోరల నుంచి పరిరక్షించాలని సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పుష్కరఘాట్ పరిసర ప్రాంతాల్లో స్వేచ్ఛ భారత్ నిర్వహించారు. ఘాట్ ను శుభ్రం చేశారు.
భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛతా పక్వాడా డిసెంబర్ 01వ తేదీ నుండి డిసెంబర్ 15 వరకు పక్షం రోజుల స్వేచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ యూనిట్ , క్యాంపు ప్రదేశంతో
rjy1పాటు చుట్టుపక్కల పరిశుభ్రతలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ ( న్యూఢిల్లీ ) ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
దీనిలో భాగంగా బుధవారం పక్షోత్సవాలలో స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమం ముగింపు సందర్భంగా సిఆర్‌పిఎఫ్ రాజమహేద్రవరం శాఖ గోదావరి పుష్కర్ ఘాట్‌లో కమాండెంట్ సతీష్ కుమార్, బిఎన్ నేతృత్వంలో స్వచ్ఛతా అభియాన్‌ ను నిర్వహించారు. నగర ప్రజల్లో స్వేచ్ఛ భారత్ పై చైతన్యం తీసుకురావడానికి పుష్కరఘాట్ పరిసర ప్రాంతాల్లో ఘాట్ లు శుభ్రం చేశారు.

Leave a Reply