ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జివో జారీ
అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశిస్తూ జీవో జారీ
ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ.1,00,000/- రూపాయల లు, మరియు మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో
అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా
అంగన్వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సింప్లిఫైడ్ చేస్తాం
దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం
అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు
దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ
అంగన్‌వాడీలకు తెలంగాణలోనే అత్యధిక వేతనాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాల పెంపు
ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు
జీవోల విడుదలపై అంగన్వాడీలు హర్షం
జివో ల అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై 115 కోట్ల అదనపు భారం
ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రులు హరీష్ రావు గారకి, సత్యవతి రాథోడ్ గారికి కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు
అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సమ్మె విరమణ చేయాలి
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో ఇబ్బందులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాం
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీలకు అరకొరగా జీతాలు
తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ.1,00,000/- రూపాయల లు, మరియు మినీ అంగన్‌వాడీ టీచర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చూసింది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా కల్పించారు.
దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందిస్తూ ప్రభుత్వం జీవో లు జరిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ … దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్ద పేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల 14వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నామన్నారు.
అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు ఇస్తూ నేడు జీవో జీవో జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. కోవిడ్ సమయంలో అంగన్వాడీల సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందజేసేయని గుర్తు చేశారు.
అంగన్వాడీలు సమ్మ విరమింప చేయాలని కోరారు. అంగన్వాడీలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను నెరవేర్చమని అన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా అంగన్వాడీలకు వర్క్ ప్రెజర్ తగ్గించే విధంగా యాప్ సింప్లిఫైడ్ చేస్తాం మని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు, ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని మంత్రి అన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, అంగన్వాడీల వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 115 కోట్ల భారం భరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల మంది అంగన్వాడిలకు లబ్ధి చేకూతుందని తెలిపారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లితండ్రి వలె ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని గుర్తు చేశారు. మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్ ఔదార్యానికి, అంగన్‌వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అంగన్వాడీల టీచర్లు హెల్పర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
kఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జేడీలు లక్ష్మీదేవి సునంద, మరియు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నిర్మలతో పాటు పెద్ద ఎత్తున యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.