ఏపీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం” అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది.
ఈ కిట్ లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది. దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి రూ.120, 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది.