Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణానదిలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది

– వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
– సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన బీజేపీ నాయకులు
– మంత్రి ఆదేశాల మేరకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పేషీ సిబ్బంది
– పీయే సృజన్ సహకారంతో సంఘటనా స్థలం పరిశీలన
– విజయవాడలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ :- ధర్మవరం నియోజకవర్గం ఓబుల్ నాయనపల్లి గ్రామానికి చెందిన అభిరామ్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. దర్శనానంతరం కృష్ణానదిలో స్నానం చేస్తుండగా దురదృష్టవశాత్తూ జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు.

ఈ విషాద వార్తను తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయాన్ని అందించేలా సమన్వయం చేసుకోవాలని వ్యక్తిగత సిబ్బందిని మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో వ్యక్తిగత సిబ్బంది మరియు విజయవాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాబ్జి స్థానికంగా తక్షణ చర్యలు తీసుకుని సహాయం అందించారు.

అంతేగాక, మంత్రి గా స్వయంగా అభిరామ్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. కుటుంబానికి మానసికంగా అండగా నిలిచారు. మరణించిన అభిరామ్ భౌతికకాయాన్ని ధర్మవరం వరకు తీసుకొచ్చేందుకు తక్షణమే ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మంత్రి తక్షణ స్పందన, మానవత్వం మరియు బాధిత కుటుంబం పట్ల చూపిన సానుభూతి హృదయాన్ని హత్తుకుంది . మంత్రి త్య కుమార్ యాదవ సానుభూతి, సేవాభావం మన దేశ రాజకీయాల్లో మార్గదర్శకంగా నిలుస్తోంది.

LEAVE A RESPONSE