Suryaa.co.in

Andhra Pradesh

అష్టావధానం సాహిత్య ప్రక్రియలో గోవింద స్వామి

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మప్రభోదంతో తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామి చక్కగా వేద వేదాంత శాస్త్రాలలో తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో శిక్షణ పొందుతున్నారు.

గత వారంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి ఆధ్వర్యంలో అష్టావధానం సాహిత్య ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అష్టవధాన కార్యక్రమంలో వృచ్చికుడుగా పాల్గొన్నారు, మంచి ప్రశ్నలు సంధించారు.మంచి ప్రతిభ కనబరిచిన గోవింద స్వామిని ఆహూతులు & విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ అభినందించారు.

ఈ సంవత్సరం చివరలో శృంగేరీలో శృంగేరి మఠాధిశులు శ్రీ భారతీ తీర్ధ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ స్థాయి భగవద్గీత పోటీలలో పాల్గొనడానికి గోవింద స్వామిని విశ్వ విద్యాలయం ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు.

ఆ పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి గోవింద స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలనేది మా కోరిక. మఠాధిపతి గా ఉండాలంటే ముందు అనర్గళంగా మాట్లాడగలిగి ఉండాలి.

– శ్రీనివాసులు పాలెపు
(VBSPP వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్)

LEAVE A RESPONSE