వీరాభిమాని..

చంద్రబాబు అభిమానులను చూసి ఉంటారు.. అనుయాయులను చూసి ఉంటారు.. అనుచరులను చూసి ఉంటారు.. సహచరులను చూసి ఉంటారు.. ఆయన్ని ఇష్ట పడే వారిని చూసి ఉంటారు..ఆయన అంటే పిచ్చి వుండే వారిని చూసి ఉంటారు..కానీ వారు అంటే భక్తి భావం కలిగిన వారు కొందరే ఉంటారు.. అటువంటి అరుదైన భక్తులలో ఒకరు.. డాక్టర్ ఇనగంటి లావణ్య ..

ఎక్కడో తెనాలి దగ్గర అమృతలూరు లో రైతు కుటుంబంలో పుట్టిన “నార్ల” వారి ఆడపడుచు.. నిమ్మగడ్డ వారి పాలెం “ఇనగంటి” వారి కోడలు..ఉన్నత విద్యా వంతురాలు.. సాహిత్యం మీద మక్కువ ప్రవేశం కలిగిన వారు..పరిశోధన చేసిన వారు.. చంద్రబాబు ఘనత గురించి వారు 2019 లో ” అలుపెరుగని పోరాట యోధుడు” పుస్తకం వ్రాసారు.. తదనంతరం వారి ఘనత ఉత్తరాది వారికి కూడా పరిచయం చేయాలి అని ” నిరంతర్ ప్రగతి కే పథ్ పర్ ” అని హిందీ లో కూడా ఒక పుస్తకం వ్రాసారు..

ఇప్పుడు చంద్రబాబు గురించి.. ” బాబు పాలనలో బయటకు రాని వాస్తవాలు” “CBN అభివృద్ధి రథ సారథి” “శ్రీరామ చంద్ర రాజ్యం” అనే మూడు పుస్తకాలు వ్రాసారు.. వారికి గుర్తింపు ఆసక్తి లేదు.. ప్రచారంపట్ల మమకారం లేదు.. కేవలం అంటే కేవలం రాష్ట్రానికి సమాజానికి జాతికి చంద్రబాబు అవసరం వుంది అనే భావనతో ఒక మూగ భక్తితో వారు వ్రాసినవి ఈ మూడు పుస్తకాలు..

హైదరాబాద్ లో 11-02-24..ఆదివారం సాయంత్రం 6 గం.లకు..అమీర్ పేట్ హోటల్ గ్రీన్ పార్క్ ప్రెమిసెస్ లో వున్న Marigold హోటల్ నందు ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.. కావున చంద్రబాబు అభిమానులు అందరూ వీలు అయినంత ఎక్కువ మంది హాజరవుదాం.. వారి ప్రయత్నాన్ని అభినందిద్దాం.

Leave a Reply