Home » మా కడుపు కొట్టే వారిని సుజనా నియంత్రించాలి

మా కడుపు కొట్టే వారిని సుజనా నియంత్రించాలి

– నాయి బ్రాహ్మల డిమాండ్
– మా మద్దతు సుజనా కే

ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు నాయి బ్రాహ్మణ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. రామారావు మాట్లాడుతూ స్పా సెంటర్లు వెలిసి మా పొట్టను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణేతరులు స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరపటం తమకు చెడ్డ పేరు వస్తుందన్నారు స్పా సెంటర్స్ లో సెలూన్ కి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలన్నారు.

ఈ జీవో సాధన పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి ద్వారానే సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామని అందుకే సుజనా కే మద్దతు ఇవ్వాలని తమ సంఘం తీర్మానించిందని రామారావు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తమ ఓట్లు మొత్తం గంపగుత్తం గా సుజనా కి వేయాలని నిర్ణయించుకున్నామని ఈ మేరకు ఒక సందేశాన్ని తమ కులం వారందరికీ తెలియపరిచామన్నారు. తమ వారికి అన్ని దేవాలయాల్లో బోర్డ్ మెంబర్స్ గా అవకాశం కల్పించాలని అన్నారు. సమావేశంలో ఉప్పూడి రాము, శ్రీను, పెద్దపూడి హేమంత్ పాల్గొన్నారు.కార్యక్రమాన్ని బి.జె.పి. అధికార ప్రతినిధి ఆర్. డి.. విల్సన్ సమన్వయం చేశారు.

Leave a Reply