తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ ఎన్నారై టిడిపి సెల్ ఎన్నారైల సహాయ సహకారాలతో ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది. ఇందులో భాగంగా తెనాలికి చెందిన అయినంపుడి శ్రీహరి గారు అమెరికాలోని చార్లెట్ నగరంలో నివసిస్తున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు గారి ని కలిసిన అంతరం వారు అందించిన స్ఫూర్తితో ఇక్కడ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులకు మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు గారు, KS జవహర్ గారి చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం అందించారు.
వివరాల్లోకెళ్తే గుంటూరు చెందిన తాడిమళ్ల జాన్ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. 2019 జనవరి 7న గుండెపోటుతో మరణించారు. వీరి కుమార్తె షెర్లీ ఫామ్ సి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ లో 4 వ సంవత్సరం చదువుతోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, చౌటేపల్లి గ్రామానికి చెందిన జి. రవిచంద్ర నాయుడు 24/07/2020 న కరోనాతో మరణించారు. వీరు తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వీరిరువురి కుటుంబాలకు శ్రీహరి గారు వారి కాలేజీ ఫీజుల కొరకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో సహాయం అందించిన అయినంపుడి శ్రీహరి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, మరియు ఎన్ఆర్ఐ టిడిపి కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, గోళ్ళ ప్రభాకర్ పాల్గొన్నారు.