• ప్రజల్ని నమ్మించడానికే తనకు డబ్బులేదు, పత్రికలు టీవీలు లేవు, అంగబలం, అర్థబలం లేదని నంగనాచి కబుర్లుచెబుతున్నాడు
• జగన్ ను మరోసారి నమ్మితే జనం నేలనాకాల్సిందే
• డబ్బులేని జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు?
• ది ప్రింట్ వెబ్ సైట్ కథనంపై ముఖ్యమంత్రి ఎందుకునోరు విప్పడు?
• పత్రికలు, టీవీలు లేవంటున్న జగన్ సాక్షి మీడియా ఎవరిదో చెప్పాలి
• అవినీతిసొమ్ముని వెదజల్లేబట్టే బ్లూమీడియా జగన్ తమ్మినా, దగ్గినా ఊదరగొడుతోంది
• సొంతపిన్ని పుస్తెలు తెంపి, బాబాయ్ ని చంపినవారితో విందులు, వినోదాల్లో మునిగితేలుతున్న జగన్ రాష్ట్రంలోని అక్కచెల్మెమ్మల్ని రక్షిస్తాడా?
• బొండా ఉమామహేశ్వరరావు
4ఏళ్ల జగన్ పాలనలో పేదల జీవితాలు తలకిందులయ్యాయని, తన అసమర్థపాలనపై ప్రజలు ప్రశ్నిస్తూ, తిరగబడు తుంటే, మరలా వారిని నమ్మించేందుకు ముఖ్యమంత్రి బోగస్ కార్యక్రమాలు, పచ్చిఅబద్ధాలతో వారిని వంచించేందు కు సిద్ధమయ్యాడని, మరోసారి జగన్ ని నమ్మితే ప్రజలతో నేలనాకిస్తాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలుక్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“జగన్ నిన్న తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం బోగస్ పథకం, చంద్రబాబు 104 వా హనాలద్వారా ఒకవైద్యుడు, ఇతరసిబ్బందిని, మందుల్ని, వైద్యపరికరాల్ని గ్రామాలకు పంపి, అక్కడే ప్రజల కు మెరుగైన వైద్యసేవలు అందించారు. ఆవ్యవస్థను నిర్వీర్యంచేసిన జగన్ ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ పేరుతో పనికిరాని కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
తనకు డబ్బులేదంటున్న జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? దిప్రింట్ వెబ్ సైట్ కథనంలో పేర్కొన్న తనఆస్తులపై ఏంసమాధానంచెబుతాడు?
ప్రజలముందు జగన్ మాట్లాడిన మాటలన్నీ పచ్చిఅబద్ధాలు. ఆర్థికంగా తాను బలవంతుణ్ణి కాదని జగన్ నిన్న చిలకలూరిపేటలో చెప్పడం పచ్చిబూటకం. దేశంలోని ముఖ్యమం త్రులందరికంటే జగన్మోహన్ రెడ్డి ధనవంతుడని, ది ప్రింట్ వెబ్ సైట్ పరిశోధనాత్మక కథ నంలో పేర్కొంది. దానిపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతారు? తనకు సంబంధించి జగన్ డిక్లేర్ చేసిన ఆస్తులలెక్కింపు ఆధారంగానే సదరు వెబ్ సైట్ ఆయనే అత్యంతధనవం తుడైన ముఖ్యమంత్రి అని తేల్చింది. ఇంకా బయటకుప్రకటించని జగన్ ఆస్తుల్ని లెక్కిస్తే ప్రపంచ దేశాధ్యక్షులు అందరికంటే ఆయనే ముందుంటాడేమో. దిప్రింట్ వెబ్ సైట్ కథనంపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడు?
తనకు పేపర్లులేవు.. డబ్బులేదు.. అంగబలం, ఆర్థికబలంలేదంటూ నంగనాచి కబుర్లతో జగన్ ప్రజల్ని ఇంకా మోసగించాలని చూస్తున్నాడు
తనకు పేపర్ లేదని, తనవద్ద డబ్బులేదని, అంగబలం, ఆర్థికబలం లేదని నంగనాచి కబుర్లు చెబుతూ జగన్ ప్రజల్ని ఇంకామోసగించాలని చూడటం సిగ్గుచేటు. సాక్షిపత్రిక, టీవీఛానల్ ఎవరివో జగన్ చెప్పాలి. ఆయనకు తొత్తులుగా మారి, ఆయనకు వంతపాడుతున్న ఇతర టీవీ ఛానల్స్ సంగతేమిటో కూడా ముఖ్యమంత్రి నోరువిప్పాలి. జగన్ నల్లధనం పెట్టుబడులు పెట్టిన అనేక టీ.వీ.ఛానల్స్ ఇప్పటికీ ఆయనకు బాకా ఊదుతున్నాయి. వేలకోట్ల పెట్టుబడి పెట్టబట్టే జగన్ తమ్మినా, దుగ్గినా సదరు బ్లూ మీడియా విచ్చలవిడిప్రచారం చేస్తోంది. తన అవినీతిసొమ్ముతో నెలకొల్పిన సాక్షిమీడియా, తాను పెట్టుబడిపెడితే, తనకు బాకా ఊదుతు న్న బ్లూమీడియాలు ఎవరివో, వాటికి జగన్ కు ఉన్న సంబంధంఏమిటో ఆయనే సమాధానం చెప్పాలి.
5ఏళ్లలో 25లక్షలఇళ్లు నిర్మిస్తాననిచెప్పిన జగన్ ముక్కిమూలిగీ, 4ఏళ్లలో 5ఇళ్లు కట్టాడు
5ఏళ్లల్లో 25లక్షలఇళ్లునిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన జగన్, 4ఏళ్ల పాలనలో ముక్కి మూలిగీ కేవలం 5ఇళ్లుమాత్రమే కట్టాడని కేంద్రప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పింది. టీడీపీప్రభుత్వం పేదలకోసం నిర్మించిన టిడ్కోఇళ్లను పాడుపెట్టడానికి జగన్ ఇష్టపడ్డాడు కానీ, లబ్ధిదారులకు ఇవ్వలేదు. సిగ్గులేకుండా టిడ్కో ఇళ్లను తనఖాపెట్టి రూ.4వేలకోట్ల అప్పులు తీసుకొని, ఆసొమ్ముని కూడా కొట్టేశాడు. ఇళ్లునిర్మించిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులుఇవ్వలేదు. ఇళ్ల కోసం ప్రజలుకట్టిన సొమ్మునికూడా వారికి తిరిగివ్వలేదు. కేంద్రం టిడ్కో ఇళ్లకు సంబంధించి రూ.40కోట్ల పెనాల్టీ ఎందుకువేసిందో ముఖ్యమంత్రే చెప్పాలి. ప్రతి పేదవాడికి ఇల్లుకట్టిస్తానన్న జగన్, ఆహామీని ఎప్పుడునెరవేరుస్తాడో చెప్పాలి.
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలుపెంచనని చెప్పిన జగన్, 4ఏళ్లలో రూ.50వేలకోట్లకు పైగా భారాన్ని ప్రజలపై మోపాడు. టిడ్కోఇళ్లను ప్రజలకు ఇవ్వకుండా తాకట్టుపెట్టి, రూ.4వేలకోట్లు కొట్టేశాడు
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని కల్లబొల్లిమాటలు చెప్పిన జగన్, 4ఏళ్లల్లో రూ.50వేలకోట్లపైన భారం ప్రజలపై వేశాడు. 4ఏళ్లల్లో 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఏప్రియల్ నుంచి ట్రూఅప్ ఛార్జీలు, యూనిట్ కు 40 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకు న్నాడు. ఇచ్చినహామీల్లో 87శాతం హామీలు నెరవేర్చానంటున్న జగన్ వాటిని ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చాడో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ బోగస్ అని, పచ్చిఅబద్ధా లని ప్రజలంతా అనుకుంటున్నారు. ఎవరి పత్రిక అని సాక్షిపత్రికకు రోజూ వందలకోట్లరూపా యల ప్రకటనలు ఇస్తున్నాడో ముఖ్యమంత్రి చెప్పాలి. ఆఖరికి వాలంటీర్లకు కూడా సాక్షిపత్రి కే ఇస్తూ, నెలకు రూ.200లు ఎందుకు చెల్లిస్తున్నారో చెప్పాలి.
జగన్ పుణ్యమా అని రాష్ట్రంలో గంజాయి, గన్ కల్చర్ వచ్చింది. 4ఏళ్లలో ఎన్ని కుటుంబా లకు ఎన్ని లక్షలిచ్చాడో జగన్ ప్రజల్లోకి వచ్చి చెప్పాలి
జగన్ పుణ్యమా అని రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా ఎక్కువైంది. జగన్ పాలనలోనే ఏపీలో గన్ కల్చర్ మొదలైంది. రాష్ట్రంలోని ఎన్నికుటుంబాలకు జగన్ రూ.లక్షచొప్పున ఇ చ్చాడో చెప్పాలని సవాల్ చేస్తున్నాం. 4ఏళ్లల్లో ఏ ఊరిలో ఎన్ని కుటుంబాలకు రూ.లక్ష చొప్పు న ఆర్థిక సాయంచేశాడో జగన్ నిరూపించాలి. ప్రతిసభలో, సమావేశంలో మొసలికన్నీరు కారుస్తూ నంగినంగి దొంగమాటలు చెప్పడం జగన్ కు అలవాటైంది. సొంతపిన్ని తాళితెగితే పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ నిచంపినవారితో తాడేపల్లి ప్యాలెస్ లో విందులు, వి నోదాల్లో మునిగితేలుతున్నాడు. సొంతతల్లిని, చెల్లిని పార్టీనుంచి బయటకు పంపి, బాబాయ్ కూతుర్ని ఢిల్లీవీధుల్లో తిరిగేలాచేసిన జగన్ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని కాపాడతాడు అంటే న మ్మాలా? రక్తంపంచుకుపుట్టిన వారికే న్యాయంచేయలేని జగన్, తమకుఎలాన్యాయం చేస్తా డని రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ప్రశ్నిస్తున్నారు.
సొంతబాబాయ్ ని చంపినవారిని 4ఏళ్లనుంచి శిక్షించలేని జగన్ ను ప్రజలు ఎలా నమ్ముతారు? సొంతతల్లిని, చెల్లిని రోడ్లపాలుచేసిన జగన్ ను రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఎలా నమ్ముతారు?
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు కొట్టేసి, సీబీఐకేసుల్లో ఇరుక్కొని, రూ.43వేల కోట్ల అక్రమాస్తులకేసులో 16నెలలు జైల్లోఉండి, 15సంవత్సరాలనుంచి తాత్కాలిక బెయిల్ పై బయటతిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి, పేదలకు భవిష్యత్ లేకుండా చేసి, మధ్యతరగతివారిని వంచించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ జగన్ పాలనసాగిస్తున్నాడు. జగన్ కు ఒక్కఛాన్స్ ఇచ్చి తప్పుచేశామని ప్రజలు వారిచెప్పు లతో వారే కొట్టుకుంటున్నారు. జగన్ చేతగానితనం, అసమర్థతవల్ల ప్రజలుబతకలేక దేవు డా అని విలపిస్తుంటే, ఇంకా వారిని నమ్మించి, తనపబ్బం గడుపుకోవడానికి పచ్చిఅబద్ధా లు చెబుతున్నాడు. దిప్రింట్ వెబ్ సైట్ కథనంపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడు? సాక్షిమీడియా జగన్ దికాదా? ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన నాడు విద్యుత్ ఛార్జీలు పెంచనని జగన్ అన్నాడా..లేదా? వివేకానందరెడ్డి హత్యకేసు హంతకుల్ని నాలుగేళ్లు అధికా రంలో ఉండికూడా జగన్ ఎందుకు పట్టుకోలేకపోయాడు? తల్లికి, చెల్లికి న్యాయంచేయలేని జగన్ కు రాష్ట్రంలోనిమహిళల గురించి మాట్లాడే అర్హతలేదు. ప్రజల జీవితాల్ని చావుదెబ్బ కొట్టిన జగన్ ను ప్రజలు నమ్మనే నమ్మరు.” అని బొండా ఉమా తేల్చిచెప్పారు.