Suryaa.co.in

Andhra Pradesh Telangana

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కిరణ్ ప్రభావం ఉంటుంది: ప్రహ్లాద్ జోషి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, మోదీ నేతృత్వంలో సాగుతున్న పోరాటంలో ఇకపై కిరణ్ కుమార్ రెడ్డి కూడా భాగస్వామ్యం కానున్నారని తెలిపారు. కిరణ్ ప్రభావం ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఉంటుందని స్పష్టం చేశారు.

గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కిరణ్ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ లో కొనసాగిందని, క్రికెట్ నేపథ్యం కూడా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇక బీజేపీ తరఫున ఆడతారని పేర్కొన్నారు. ఏపీలో కిరణ్ సూపర్ బ్యాటింగ్ చేస్తారని చమత్కరించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో ఏపీ బీజేపీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్ జోషి నమ్మకం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE