టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్
4 దశాబ్దాల ప్రస్థానంలో… రాయలసీమ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ….రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన సంస్థ అమరరాజా. 1 బిలియన్ డాలర్ కంపెనీ ఇప్పుడు సొంత రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి కారణం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా?
ఏపీలో పుట్టిన సంస్థ తొలిసారి చిత్తూరు వదిలి రాష్ట్రం వెలుపల రూ.9500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ప్రతిష్టాత్మక సంస్థను ప్రోత్సహించాల్సింది పోయి…గతంలో ఇచ్చిన భూములు కూడా వెనక్కి తీసుకున్నారు. పర్యావరణ అనుమతులు, తనిఖీల పేరుతో నిత్యం ఇబ్బంది పెట్టారు.
ఉపాధి నిచ్చే పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మీ శాడిజం చాటుకున్నారు. కోర్టు తప్పుపట్టినా మీ వైఖరి మార్చుకోలేదు.మీ రాజకీయ కక్షలతో ప్రజల ప్రయోజనాలనే కాదు…రాష్ట్ర ప్రతిష్టనే పణంగా పెట్టారు. రాష్ట్రానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలు, చరిత్ర క్షమించవు.