– ఆకట్టుకున్న చిన్నారుల సాంస్క్రృతిక కార్యక్రమాలు
బ్రూక్స్‌విక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దఎత్తున దీపాలు వెలిగించి ఆ ప్రాంతమంతా దీపకాంతులు వెదజల్లేలా అలంకరించారు.
ముఖ్యంగా మహిళలు నూతన వస్త్రాలు ధరించి కాలుష్య రహితమైన దీపావళి టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పండుగలను తలపించేలా అమెరికాలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కిశోర్ కంచర్ల మాట్లాడుతూ… తెలుగువారందరూ ఒకచోటికి చేరి అన్ని పండుగలు సాంప్రదాయబద్ధంగా జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని కిశోర్ కంచర్ల , అరవింద యడ్లపాటి సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ కొల్లి, రూపేష్ చౌదరి కోనేరు, రమేష్ గరికపాటి, మురళీకృష్ణ ఇంటూరి, వాసు తదితరులు పాల్గొన్నారు.