– స్వయం ప్రతిపత్తిగా పని చేయకుండా సంకెళ్లు
– కమిషన్ లో ఇద్దరు కాదు పూర్తి స్థాయిలో 11 మంది కమిషనర్ల నియామకం జరగాలి
– పీసీసీ చీఫ్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం. పాలనలో పారదర్శతకు నిదర్శనం. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి. రాజ్యాంగం తర్వాత ప్రాముఖ్యత దక్కింది ఒక్క ఆర్టీఐ కి మాత్రమే. ప్రభుత్వానికి జవాబుదారితనం, పౌరులకు సాధికారిత సమాచార హక్కు చట్టం కల్పించిన గొప్ప వరం. ఈ చట్టం విప్లవాత్మకం మరియు దేశ పౌరులకు వజ్రాయుధం.
ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్నైనా పొందేందుకు 2005లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం చేస్తే, నేడు మోడీ అదే హక్కుకు తూట్లు పొడిచారు. స హ చట్టానికి దగ్గరుండి మరి సమాధి కట్టారు. మోడీ గద్దెనెక్కిన నాటి నుంచే సహ చట్టంపై పగబట్టారు.
సవరణల పేరుతో ఆర్టీఐ ను మేడిపండు చందంగా మార్చారు. వ్యక్తిగత సమాచారం సవరణ ముసుగులో మోడీ & కో అవినీతి బయటపడకుండా సవరించుకున్నారు. ఓట్ల చోరీ లాంటి దొంగపనులను వెలుగులోకి రానివ్వకుండా ఆర్టీఐ ను కట్టడి చేశారు. స్వయం ప్రతిపత్తిగా పని చేయకుండా సంకెళ్లు వేశారు.
కేంద్ర సమాచార కమిషన్ కి చీఫ్ లేరు. కనీసం పూర్తిస్థాయిలో సభ్యుల నియామకం కూడా జరగలేదు. 2024 నాటికి దేశంలో ఉన్న 29 కమిషన్లలో పౌరులు పెట్టుకున్న 4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే, ఆర్టీఐ ని ఎలా బంధించారో అర్థమవుతుంది.
ఆర్టీఐ 20వ వార్షికోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2019 సవరణలను వెంటనే రద్దు చేయాలి. కమిషన్ సభ్యుల పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా మళ్ళీ నిర్ణయించాలి. సమాచార కమిషనర్లు స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా పనిచేసే స్వేచ్ఛను పునరుద్ధరించాలి. కమిషన్ లో ఇద్దరు కాదు పూర్తి స్థాయిలో 11 మంది కమిషనర్ల నియామకం జరగాలి.
విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విజిల్ బ్లోయర్ల ప్రొటెక్షన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. వారికి రక్షణ కల్పించాలి. జర్నలిస్టులు, మహిళలు, విద్యావేత్తలతో పాటు కమిషన్ లో అన్నివర్గాల ప్రతినిధులను నియమించాలి.