వైసీపీ పాలనలో ఊరికో ఉన్మాది…

Spread the love

-వైసీపీ వెధవలంతా కూడా … మహిళలకే పుట్టామనే నిజాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే మంచిది
– అధికారమనే అహంకారంతో విర్రవీగితే ఆడవాళ్లచేతిలో చెప్పుదెబ్బలు, చీపురు సత్కారాలే మిగులుతాయి.
• వైసీపీనేత నారాయణమూర్తి ఒక టీవీ చర్చా వేదికలో తనను అనరాని మాటని శునకానందం పొందాడు
• దళిత మహిళను, గొప్పకుటుంబం నుంచి వచ్చినదాన్ననే ఆలోచనకూడా లేకుండా హద్దులమీరి మాట్లాడాడు
• అలాంటి వెధవల్ని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్ధరిస్తున్నానంటూ కలరింగ్ ఇస్తున్నాడు
• టీడీపీ పక్షాన రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై నాలాంటి వారు మాట్లాడకూడదా?
• మహిళలమానప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి, హోంమంత్రి, వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులకన్నా పెద్ద మెంటల్ గాళ్లుఎవరూ ఉండరు.
– టీడీపీ మహిళా నేత కావలి గ్రీష్మా ప్రసాద్

టీడీపీ తరఫున ప్రజలసమస్యలు.. మహిళలఇబ్బందులు, వారి సమస్యలపై వీలైనప్పుడల్లా బహిరంగ వేదికలపై, మరీ ముఖ్యంగా టీవీఛానళ్ల చర్చల్లో ప్రస్తావిస్తూ, ప్రభుత్వవైఫల్యాలను, మహిళలు, చిన్నారులకు ఈప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అందరికీతెలిసేలా చేస్తున్నానన్న అక్కసుతో నిన్నటికి నిన్నఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో వైసీపీ నాయకుడు, నవరత్నాలఅమలు కమిటీకి వైస్ ఛైర్మన్అయిన నారాయణమూర్తి హద్దులుమీరి అతి గా మాట్లాడాడని, చర్చమొదలైన దగ్గరనుంచీ తాను మాట్లాడు తుంటే జోక్యంచేసుకోవడమేగాక, హేళనగా, అసభ్యంగా మాట్లాడు తూ నన్నుకించపరిచాడని టీడీపీమహిళానేత కావలి గ్రీష్మాప్రసా ద్ వాపోయారు.

శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అంతర్ముఖంగానే కాకుండా, బయట మరీముఖ్యంగా టీవీచర్చావేదికల్లో వైసీపీనేత లు మహిళలను దారుణంగా అవమానిస్తూ, నోటికొచ్చినట్లు మా ట్లాడుతున్నారని, కొందరైతే మరీ బరితెగించి ఆడవాళ్లనే ఇంగితం కూడా పశువుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే … జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నఈరాష్ట్రంలో మహిళలకు నిజంగా రక్షణ, వారికి న్యాయంలభిస్తుంటే, తాము ఇష్టపడుతున్న ప్రభుత్వం, పాలకులు ఏంచేస్తున్నారో అదిమాత్రమే వైసీపీవారు చెప్పుకోవాలి. అలాకాకుండా … ఎదుటివారిని, ప్రతిపక్షపార్టీల తరుపున మాట్లాడేవారిని దూషిస్తూ, శునకానందం పొందడం సరి కాదు. అది మనుష్యులు అనేవారికి ఎవరికీ ఎంతమాత్రం సరైంది కాదు. ముఖ్యంగా వైసీపీనేత నారాయణమూర్తి నిన్నజరిగిన టీవీ చర్చావేదికలో నన్నుఉద్దేశించి అనరానిమాటన్నాడు.

రాష్ట్రంలో మహిళలు, మరీముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలగురించి నేను మాట్లాడుతుంటే సదరు బుద్ధిలేని నారాయణమూర్తి నన్నుఉద్దేశించి, ఎందుకంతలా రెచ్చిపోతున్నావు… నిన్నుఎవరైనా రేప్ చేశారా అనిఅనడం అతనిలోని పైశాచికత్వానికి, క్రూరత్వానికి నిదర్శన మనే చెప్పాలి. బాధ్యతాయుతమైన పదవిలోఉండి…. తానొక మనిషననే విషయంకూడా మర్చిపోయి వైసీపీనేత నారాయణ మూర్తి మహిళనైన నన్ను పట్టుకొని అంతమాటఅన్నాకూడా తాను ఆయన్ని ఒక్కమాట అనలేదు. ఎందుకంటే నేను అతనిలా పశులక్షణాలతో ప్రవర్తించే మనిషినికాదు.

మహిళను… అదీ టీడీ పీ మహిళానేతను. నాలో ఆదినుంచీ ఉన్న మాకుటుంబం, నా తల్లిదండ్రులు నేర్పిన సభ్యతాసంస్కారాలు.. టీడీపీనేర్పిన మర్యాద మన్ననలు అతన్నిఅనడానికి అడ్డొచ్చాయి. నేను ఏమీ అనలేద న్న ఉద్దేశంతో అతనుమరింతరెచ్చిపోయి మాట్లాడాడు. మనిషికి పుట్టినవాడెవడూ మాట్లాడని విధంగా మాట్లాడాడు. దళిత యువతిని అయిన నేను ఆదినుంచీ మాతాత, తండ్రుల బాటలోనే నడుస్తున్నాను. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్యగారు మాతాతగారు. ఆయన దళితులసంక్షేమంకోసంఎంతగానో పోరాడారు.

అలానే నాతల్లి గారైన కావలి ప్రతిభాభారతి గారు ఏపీఅసెంబ్లీకి తొలిమహిళాస్పీకర్ గా వ్యవహరాంచారు. అలాంటిగొప్పవారి అడు గుజాడల్లో నడిచి, మహిళలకు న్యాయంచేస్తూ, వారికి అన్నివిధా ల అండగాఉంటున్న టీడీపీ నాయకత్వంలో పనిచేస్తున్న నన్ను పట్టుకొని ఒకఉన్మాదపార్టీకి చెందిన ఉన్మాది నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఆడపిల్లను అనకూడదనే ఇంగితంకూడా లేకుండా నారాయణమూర్తి తనలోని పశుత్వాన్ని టీవీచర్చలోప్రదర్శించాడు . వ్యక్తిగతంగా తిడితే టీడీపీకి చెందిన ఆడవాళ్లెవరూ బయటకు రారు.. మాట్లాడరన్న ఆలోచనల్లో వైసీపీప్రభుత్వం, ఆపార్టీనేతలు ఉన్నారు.

మానభంగంజరిగితేనే మానభంగానికి గురైన వాళ్లగురించి మాట్లా డాలా అని చేతగాని, దద్దమ్మలైన వైసీపీవాళ్లనుప్రశ్నిస్తున్నాను. ఎదుటిమహిళల్ని ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్న వైసీపీనేతలు, కార్యకర్తలు, వైసీపీపేటీఎం బ్యాచ్ లకు అమ్మా, అబ్బలు లేరా? వారి ఇళ్లలోనిఅమ్మలను, అక్కచెల్లెళ్లను, భార్యలనుకూడా అలానే అనగల ధైర్యం వైసీపీవెధవలకుఉందా? రాజ్యాంగాన్ని రేప్ చేసింది వైసీపీప్రభుత్వం. రాజ్యాంగాన్ని ఇప్పటికీ పొడిచిపొడిచి చంపుతూ, వికృతానందంపొందుతూ, న్యాయస్థానాలను, న్యాయ మూర్తులను అవహేళనచేస్తున్నది వైసీపీప్రభుత్వం, ఆపార్టీనేతలు కాదా?

ఎదుటిపార్టీలకుచెందిన, ప్రత్యర్థులకుచెందిన ఆడవాళ్లను అంటే పదవులువస్తాయని నోటకొచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు, బురదలోపొర్లేపందులకు పెద్దగా తేడాలేదనే చెప్పాలి. మిస్టర్ నారాయణమూర్తి నిన్నెవరు రేప్ చేశార్రా వెధవా… రేప్ కు గురయ్యే ఇలా బరితెగించి మాట్లాడావా? అరేయ్ వెధవా… నారా యణమూర్తి నువ్వుఅన్నది నన్నుకాదు.. యావత్ మహిళాజాతి ని…ఒకదళితమహిళను అన్నావు. దళితమహిళల్ని అనరాని మాటలంటూ వారిని వేధించి, హింసిస్తూ వికృతానందం పొందుతున్న నారాయణమూర్తి, జగన్మోహన్ రెడ్డిలాంటి వాళ్లు దళితజాతిని ఉద్ధరిస్తున్నారా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి, అతనిపార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు, నారాయణమూర్తిలాంటి పోరంబోకులు రోడ్లపైకి వస్తే ఆడబిడ్డలు, యువతులు చెప్పులు, చీపుర్లతో చావగొట్టడాని కి రెడీగాఉన్నారు. ఆ విషయం గుర్తుంచుకోండిరా.. నీతిమాలిన వెధవల్లారా?

మీకునిజంగా దమ్ముంటే భద్రతలేకుండా ఆడబిడ్డ ల మధ్యకువెళ్లండిరా చూద్దాం. ప్రతిరోజూ ఆడబిడ్డలను, యువతు లను వేధిస్తూ, ఏం చేస్తున్నారురా మీరు? చేతగానిదద్దమ్మలు మీరు. ఆడబిడ్డలను, యువతులను, చిన్నారులను రక్షించలేని మీ ముఖ్యమంత్రి కూడా ఒకముఖ్యమంత్రేనా? అతనికే మెంటల్ ఉందిరా నరంలేనినాలుక నారాయణమూర్తి. చట్టసభల్లో ఉంటూ ఆడవాళ్లను తూలనాడుతూ, వారిగురించి అసభ్యంగా మాట్లాడు తున్న వైసీపీమంత్రులు, ఎమ్మెల్యేలను మించిన మెంటల్ గాళ్లు ఎవరూలేరురా నారాయణమూర్తిగా.

ఆడబిడ్డై ఉండి…సాటిఆడవా ళ్లపై జరుగుతున్న దుర్మార్గాలను, వికృతాలను ఆపలేని హోం మంత్రికి కూడా మెంటలేరా.!అందరూ కలిసి మూకుమ్ముడిగా మెంటల్ ఆసుపత్రిలోచేరండిరా సన్నాసుల్లారా? నారాయణమూర్తి లాంటి నీతిమాలిన వెధవల్ని టీవీలవారు చర్చలకు పిలవకుండా ఉంటే వారికే మంచిది. నన్ను దూషించిన నారాయణమూర్తి మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణచెప్పి, తనతప్పు ఒప్పుకోవాలి. నారాయణమూర్తి లాంటివెధవల్ని ఎలా భరిస్తున్నా రో అతని ఇంట్లోని మహిళల్నినిజంగా మెచ్చుకోవాల్సిందే. పదవు లకోసం ఆడవాళ్లను అంటూ, జగన్మోహన్ రెడ్డి మెప్పుపొందాలని చూస్తే ఏ వెధవనాకొడుకునైనా సరే..ఈసారి ఇంటికెళ్లి తంతాము.

నాకుజరిగిన అవమానంపై అందరూ ఆలోచించాలి. తెలుగుదేశం అమ్మాయిని అన్నారులే… మాకెందుకు అని ఊరుకునేవాళ్లందరూ రేపో, మాపో వైసీపీఊరకుక్కలచేతిలో అవమానాలు, అవహేళన లు ఎదుర్కోకతప్పదు. మేథావులు… ప్రజాసంఘాలు..దళిత సంఘాలనేతలు నారాయణమూర్తి లాంటినీతిజాతిలేనివెధవల వైఖరిని, అలాంటి వారిఅహంకారాన్ని, మదాన్నిఅణచివేయాలని పత్రికాముఖంగా కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకా మానవత్వం ఉందనే అనుకుంటున్నాను. నాకుజరిగిన అవమానంపై న్యాయంజరిగేవరకు వైసీపీని, ఆపార్టీనేత నారాయణమూర్తిని వదిలేదిలేదని ఈసందర్భంగా హెచ్చరిస్తున్నాను.

Leave a Reply