తాడేపల్లి ప్యాలెస్ ఖజానా ఫిల్లింగ్ కోసమే మద్యం స్మగ్లింగ్

– పుష్ప సినిమాలో ఎర్రచందన్నాన్ని పాలట్యాంకర్లలో స్మగ్లింగ్ చేస్తే, వైసీపీనేతలు పొరుగురాష్ట్రాల్లోని హానికారకమద్యాన్ని సముద్రమార్గంద్వారా, తారుట్యాంకర్లలో నెల్లూరుకు చేరుస్తున్నారు
– నెల్లూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమమద్యం వ్యవహారాల్లో మునిగితేలుతున్న అధికారపార్టీఎమ్మెల్యేల గుట్టురట్టవ్వాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం
• జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రజలప్రాణాలుకాపాడాలన్న ఆలోచనఉన్నా..ఏపీలో సాగుతున్న మద్యంతయారీ, అమ్మకాలతోపాటు.. పొరుగురాష్ట్రాలనుంచి ఏపీకితరలివస్తున్న హానికారకమద్యం వ్యవహారంపై తక్షణమే సీబీఐవిచారణ జరిపించాలి
• గోవాఅక్రమమద్యం సముద్రమార్గంలో, తారుట్యాంకర్లద్వారా నెల్లూరుకు వస్తోంది
• అక్కడ సీసా రూ.20లకు కొని, నెల్లూరులోని ప్రభుత్వమద్యందుకాణాల్లో రూ.200లు, ఆపైన అమ్ముతున్నారు
• 2014లో గోవామద్యం నెల్లూరులోపట్టుబడిన కేసులో ఇప్పటివైసీపీఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ10గా ఉన్నాడు
• నెల్లూరుజిల్లాలోని చాలామంది వైసీపీనేతలకు తమిళనాడు, కర్ణాటకలోని అక్రమద్యంవ్యాపారులతో సంబంధాలున్నాయి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరుజిల్లాలో పట్టుబడిన గోవా అక్రమమద్యాన్ని నేరుగాప్రభుత్వ దుకాణల్లోనే అమ్ముతున్నారని, గోవానుంచివచ్చిన 17వేలకు పైగా మద్యంసీసాలుపట్టుకున్న రెండ్రోజులకే పాండిచ్చేరికి చెందిన 700సీసాల అక్రమద్యం పట్టుబడిందని, ఈ వ్యవహారం ఆషామాషీ గా పరిగణించాల్సిందికాదని, సముద్రమార్గం ద్వారానే ఇతరరాష్ట్రాల నుంచి నెల్లూరుజిల్లాకు అక్రమమద్యం వస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపా రు.శుక్రవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే … సముద్రంలో పడవలకింది భాగాన మద్యంసీసాలను తాళ్లతోకట్టి, అక్రమంగా ఏపీకి తీసుకొస్తున్నారు. మైపాడు బీచ్ ద్వారా ఇతర రాష్రాలకు చెందిన విషపూరితమైన కల్తీమద్యం నెల్లూరుజిల్లాకు వస్తోంది. గోవాలో రూ.20లకు కల్తీమద్యంకొని, దాన్నిఇక్కడకు తీసుకొచ్చి రూ.200నుంచిఆపైన అమ్ముతున్నారు. పొరుగురా ష్ట్రాలనుంచి వస్తున్నవిషపూరితమద్యం చాలాచాలా హానికరమైనది.

ఆ మద్యంఏపీలోకి మరీముఖ్యంగా నెల్లూరుజిల్లాకు వస్తోందం టే అదీసాదాసీదా వ్యక్తులెవరూ చేయలేరు. అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులప్రమేయం, వారిప్రోత్సాహంతోనే ఇతరరాష్ట్రాలకు చెం దిన విషపూరితమద్యం నెల్లూరుజిల్లాకు వస్తోంది. గోవామద్యం పాండిచ్చేరినుంచి కర్ణాటకకు, అక్కడినుంచి నెల్లూరుజిల్లాకు రవా ణా అవుతోంది. ఇటీవలపట్టుబడిన గోవామద్యమే, 2014లో రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉన్నప్పుడు నెల్లూరులో పట్టుబడింది.

ఆనాడు కేసులుకూడా నమోదుచేశారు. ఆనాడుకేసులునమోదైన వారిలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కూడాఉన్నాడు. 2014లో ఇతరరాష్ట్రాలనుంచినాసిరకం మద్యాన్ని నెల్లూరుకు చెందిన వైసీపీనేతలకు సరఫరాచేసినవారిలో అప్పుఅనేవ్యక్తి కీలక నిందితుడని పోలీసులు ఆనాడుగుర్తించారు. అతన్నిఅరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లోఉంచితే అక్కడే చనిపోయాడు. అతనితో పాటు పట్టుబడిన మిగతాముద్దాయిలు ఇప్పుడు గోవామద్యాన్ని నెల్లూరుకు తీసుకొస్తున్నారు.

పుష్పసినిమాలో పాలట్యాంకర్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడాన్నిచూశాం. కానీ ఏపీలో అధికారపార్టీనేతలు సాగిస్తున్న మద్యంస్మగ్లింగ్ చూస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే. గోవాతో, ఇతరరాష్ట్రాల్లో తయారవుతున్న హానికారక మద్యాన్నినెల్లూరుకు చెందినవైసీపీనేతలు, వారిఅనుచరులు పడవలకిందిభాగంలో సీసాలుకట్టి.. సముద్రమార్గంద్వారా.. మరోరూపంలో తారుట్యాంకర్లలోపెట్టి నెల్లూరుకు చేరుస్తున్నారు. ఆ సినిమాలో చూపించినదానికంటే వందరెట్లు అధికంగా నెల్లూరుకు పొరుగురాష్ట్రాలమద్యం దిగుమతి అవుతోంది.

అలా తీసుకొచ్చిన మద్యాన్ని వైసీపీనేతలే దగ్గరుండిమరీ ప్రభుత్వ మద్యందుకాణాల్లో అమ్మిస్తున్నారు. గోవా, కర్ణాటకలోని మద్యం మాఫియాల్లోనిన కీలకవ్యక్తులతో ఏపీలో ఎవరెవరికి సంబంధాలున్నాయో కూడాచూడాలి. గోవానుంచి అక్రమమద్యం తరలిస్తూ 2014లో పట్టుబడిన వారి ఛార్జ్ షీట్లోకాకాణి గోవర్థన్ రెడ్డి ఏ10గా ఉన్నా డు. బెంగుళూరుకుచెందిన రాజేంద్ర నిర్మల్ కుమార్ ఏ9గా ఉంటే, రాజమహేంద్రవరం జైల్లో చనిపోయిన అప్పు అలియాస్ గోపాల కృష్ణస్వామి (తమిళనాడు) ఏ6గాఉన్నాడు.

గోవాలోని నేషనల్ డిస్టిలరీస్ కు చెందిన శామ్యూల్ మాంత్రో, నియల్ మాంత్రోలు ఏ11గాఉన్నారు. అక్రమమద్యానికి సంబంధించి 2014లో ఏపీ పోలీసులు నమోదుచేసిన ఛార్జ్ షీట్లో కాకాణి గోవర్థన్ రెడ్డికి, ఇతర రాష్ట్రాలకుచెందిన మద్యం అక్రమవ్యాపారులకుఉన్న సంబంధం ఏమిటోబట్టబయలైంది. అక్రమమద్యానికి సంబంధించి గతంలో నమోదైన 4కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లలో కూడా గోవర్థన్ రెడ్డిపేరుంది. అదేవిధంగా గోవానుంచి హానికారకమద్యాన్ని ఎలా తీసుకొస్తున్నారోకూడా సదరుఛార్జ్ షీట్లో పేర్కొన్నారు.

2014ఎన్నికలసమయంలో నిత్యావసరవస్తువులు తీసుకొచ్చిన ట్టు గోవానుంచి హానికారకమద్యాన్ని ఏపీకి తీసుకొచ్చామని గతం లో అరెస్ట్ అయినప్పడు నిందితులే స్వయంగా విచారణలో ఒప్పుకున్నారు. ఆనాడుతిరుపతి సీఐడీ ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి అక్రమద్యం తరలింపు, అమ్మకాలకు సంబంధించి దాదాపు 11 ఛార్జ్ షీట్లు నమోదుచేశారు. సదరుఅధికారి ఇప్పుడుకూడా ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. 2014లో అక్రమద్యం పట్టుబడిన ప్పుడు దాన్ని ల్యాబ్ లలో పరీక్షచేయిస్తే, సదరుహానికారకమద్యం రెండుసీసాలు తాగితే మనిషి చనిపోతాడని తేలింది.

2014లో గోవా నుంచివచ్చిన హానికారకమద్యం తాగినవారిలో 9మంది చనిపోయారు. అదే గోవామద్యాన్ని ఇప్పుడు మరలా నెల్లూరుకు తీసుకొచ్చి ప్రభుత్వదుకాణాల్లో అమ్ముతున్నారంటే, ఎంత దారుణమో ఆలోచించండి. ఏపీలో తయారయ్యేమద్యమే హానికారకమైనదని స్వయంగా అధికారపార్టీఎంపీ రఘురామ కృష్ణంరాజు ల్యాబ్ లలో చేయించిన మద్యంపరీక్షల్లోనే వెల్లడైంది. ఇక్కడఅమ్మే నాసిరకం మద్యం చాలదన్నట్లు, మరింతగా ప్రజల ను దోపిడీచేయడానికి ఏకంగా అధికారపార్టీనేతలే ఇలాబరి తెగించి, పొరుగు రాష్ట్రాల నుంచి హానికారక మద్యాన్ని ఏపీలోని ప్రభుత్వమద్యందుకాణాల్లో అమ్మిస్తున్నారు.

నెల్లూరుకేంద్రంగా సాగుతున్న ఇతరరాష్ట్రాల అక్రమమద్యం అమ్మకాలు ఆషామాషీ వ్యక్తులుచేస్తున్న పనికానేకాదు. ఈ వ్యవహారంలోఉన్న అధికారపార్టీనేతలు, ఇతర పెద్దతలకాయల పాత్ర, ప్రమేయం తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం.

జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనఉన్నా తక్షణమే రాష్ట్రంలో సాగుతున్న అక్రమమద్యం అమ్మకాలతోపాటు, ఇతరరాష్ట్రాల నుంచి ఏపీకివస్తున్న హానికారకమద్యం, దానిరవాణా, అమ్మకాలపై సీబీఐవిచారణకు ఆదేశించి, అక్రమమద్యం వ్యాపారంలో మునిగితేలుతున్న తనపార్టీవారిని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply