Suryaa.co.in

Telangana

సైబరాబాద్ లో ‘గ్రీవెన్స్ సెల్’ సమీక్షా సమావేశం

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గ్రీవెన్స్ సెల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసిన విషయం విధితమేనన్నారు. కాగా సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్ కు మంచి స్పందన వస్తుందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.
ఈరోజు ముఖ్యంగా ఆర్మ్ డ్ లైసెన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్స్, పెట్రోలియం పర్మిషన్స్,స్కూల్ పర్మిషన్స్ తదితర అంశాలపై చర్చించి సత్వరంగా పరిష్కరించాలన్నారు.సినిమాటోగ్రఫీ పర్మిషన్స్ క్లియరెన్స్ కోసం వివిధ శాఖలతో సమన్వయపర్చేందుకు లైజనింగ్ అధికారిని నియమిస్తున్నామని చెప్పారు.పోలీసు సిబ్బంది యొక్క టీయస్ జిఎల్ఐ బాండ్లను అర్హత ఉన్న వారందరికీ అందేలా చేయాలని సంబంధిత సెక్షన్ అధికారులను ఆదేశించారు.బాలానగర్, ఆల్వాల్, శామీర్ పేట్, మైలర్దేవ్పల్లి, షాద్ నగర్ మొదలగు పోలీస్ స్టేషన్లలో పోలీసు సిబ్బందికి బ్యారక్ లు, రెస్ట్ రూములు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరితమన్నారు.
నూతనంగా ప్రారంభించనున్న కేశంపేట్ పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్ల ప్రారంభం, కొత్తగా నిర్మించనున్న భరోసా సెంటర్ పై చర్చించారు.సిబ్బందికి సమస్యలుంటే ఉంటే గ్రీవెన్స్ సెల్(8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., , ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., విమెన్& చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సిఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీ మట్టయ్య, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE