గుంటూరు: సెంట్రల్ జి.ఎస్.టి పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరిగింది. మంగళవారం గుంటూరు నగరంపాలెం లోని సి.జి.హెచ్.ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్ కోటేశ్వరరావు ను జీఎస్టీ పెన్షనర్ల సంఘం ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ..కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు తాము అన్నీ విధాల అండగా ఉంటామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల చేత అందరూ అభిమానించే వైద్యునిగా రూపుదిద్దుకోవడం తమకు లభించిన నిజమైన గౌరవమన్నారు.
పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి.వివేకానంద మాట్లాడుతూ…పెన్షనర్లను రోగులుగా కాకుండా, ఆత్మీయులుగా చూసే కోటేశ్వరరావు అభినందనీయులన్నారు. సీజిహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్యచౌదరి మాట్లాడుతూ.. సి.ఎం.ఓ కోటేశ్వరరావు రోగులను సేవాదృక్పథంతో చూడటం ప్రశంసనీయమన్నారు.
పెన్షనర్ల సంఘం కోశాధికారి పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యుడు కనిపించే భగవంతుడన్నారు. అనంతరం డాక్టర్ కోటేశ్వరరావు చేత కేక్ కట్ చేయించి అందరికీ తినిపించారు.. కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ సిబ్బంది అయోష, సునీల్, మురళీ, రామారావు, మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి మరియు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.