హైదరాబాద్: తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి , శాలువతో సత్కరించి , ఆశీస్సులు తీసుకున్నారు.
ప్రతి నెలా రూ 10.00 కోట్ల నష్టాలలో ఉన్న విజయ డైరీని సంవత్సర కాలంలోనే నిర్వహణా లాభాల్లోకి తీసుకొని వచ్చిన ఆ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ని ముఖ్యమంత్రి అభినందించారు. మరింత పట్టుదలతో పని చేసి , లాభాలను సంస్థ ద్వారా పాడి రైతుల సంక్షేమానికి ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి , గుత్తా అమిత్ రెడ్డి కి సూచించారు.
మరో సంవత్సరం కాలంలో విజయ తెలంగాణ డైరీ అమ్మకాలను పెంచి, సమాఖ్యను పూర్తి లాభల్లోకి తీసుకుని వస్తానని, అందుకు పక్క ప్రణాళికతో పని చేస్తున్నామని గుత్తా అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి కి హామీనిచ్చారు.