ఎల్.కె.అద్వానీకి భారతరత్న రావటం సంతోషం

– టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

భారతరత్న అవార్డు గ్రహీత బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి శుభాకాంక్షలు. అద్వానీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కష్టపడి నిబద్దతతో పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందనేదానికి ఇదే ఉదాహరణ. అద్వానీ తన రాజకీయ రంగ ప్రవేశం నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగేవరకు హుందాగా రాజకీయాలు చేశారు. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అద్వానీ దేశ ప్రజలకు అందించిన సేవలు ఎనలేవిని. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply