– టీడీపీ వాణిజ్య విభాగం లోగోను ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు
తెలుగుదేశంపార్టీ వాణిజ్య విభాగం లోగోను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వ్యాపారస్తులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.వైసీపీ అరాచకాలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులపై సమిష్టి పోరాటం చేసి వైసీపీకి బుద్ధిచెప్పాలన్నారు. లోగోను ఆవిష్కరించిన వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్, పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.