ధర్మాన్ని పాటించని జగన్ కు ఆ విషయం ఎలా తెలుస్తుంది?

Spread the love

– నారా లోకేశ్

సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి.. అనువంశిక ధర్మకర్తను గౌరవించడం ఏం తెలుస్తుందని మండిపడ్డారు. ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తను గౌరవించడం ఏం తెలుస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు తెలియకుండానే బోడికొండపై రామాలయ నిర్మాణం తలపెట్టడం, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నించిన అశోక గజపతి రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని అన్నారు. ఆలయాలకు రక్షణ కల్పించడంలో విఫలమైన మంత్రులు.. ఇప్పుడు ఏకంగా దేవాలయాల సంప్రదాయాలు పాటించకుండా అపచారం తలపెడుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

Leave a Reply