– కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా?
– నాపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించా
– సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా
– హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి
– నేను ఇండిపెండెంట్ గా ఉంటా
– పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత?
– నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి
– మీకు,మీకు ఒప్పందాలు ఉన్నాయి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్.
కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు,ఏడు నెలలు రీసెర్చ్ చేశారు. కేసీఆర్ కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదు. కేసీఆర్ పై ఆబండాలు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ళు ప్రజలు గుర్తు ఉంచుకుంటున్నారు.
కేసీఆర్ కు అవినీతి మరక ఎట్లా వచ్చింది బిఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవినీతి మరక అంటింది. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు,మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉంది.
కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చింది. నాపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించాను. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారు. నా వెనుక బీజేపీ ఉంది,కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్ గా ఉంటాను. కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది.
కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా? వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు. అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు.
హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు. నాపై కుట్రలు చేసిన సహించాను. కానీ కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్న. నేను ఎవరు ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాను. సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారు.
కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత? నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం పి.సి.ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్ లో ఫోటో రాదు.
నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి. మీకు,మీకు ఒప్పందాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము బీహార్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగినముత్యంలా బయటకు వ