ద్వారకా తిరుమలలో “నిత్య ఆర్జిత కళ్యాణం” చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. రోజుకి దాదాపు రెండొందలమంది చేయించుకుంటారు.
ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మూడు గంటలపాటు జరిగే కళ్యాణం ఒక ఎత్తు..
ఆ కళ్యాణం అయ్యాక, ఓ మహానుభావుడు వచ్చి మంత్రపుష్పం చదివి, ఆ తర్వాత గోత్ర నామాలు చదువుతారు. ఈ ప్రహసనం ఇంకో ఎత్తు.
కళ్యాణం టికెట్ కౌంటర్లో భార్య భర్త గోత్రం – పేరు కాగితాలమీద రాసి ఈయనకి ఇస్తారు. అవి ఆయన ఎప్పుడు కంఠస్థం చేస్తారో తెలీదు కానీ కళ్యాణం అయ్యాక, మంత్రపుష్పం చదివాక ఆయన గోత్రం – పేర్లు ఆ కాగితాలు చూడకుండానే చదువుతారు.
మనం రోజూ పూజలో చదివే కేశవ నామాలే ఒక్కోసారి పరధ్యానంలో అటూ ఇటూ చదువుతాం.
ఈయన మాత్రం ఎవరి పేరున ఏ గోత్రం వ్రాసుంటుందో అదే క్రమంలో తప్పులేకుండా చదువుతారు. ఆయనకి పేరుకానీ, గోత్రంకానీ కొత్తగా అనిపించి అనుమానమొస్తే అప్పుడు ఆయన చేతిలో కాగితం చూసి చదివి, అది కరెక్టేనా కాదా అని మైకులో అడుగుతారు.
రెండు వందల గోత్రాలు – నాలుగువందల పేర్లు సునాయాసంగా చదవడం మామూలు విషయం కాదనిపిస్తుంది.