• ప్రహరీ గోడ పేరుతో స్థలాన్ని ఆక్రమించి, దాడి
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు బోరగం శ్రీనివాసులు, వలవల బాబ్జి
మంగళగిరి: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లింగారెడ్డి పల్లికి చెందిన తాళపరెడ్డి గోపాల్ రెడ్డి గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. తమ గ్రామంలో 2001లో సర్వే నంబర్లు 5-1, 5-2లలో కలిపి 7-54 సెంట్ల భూమిని స్థానిక రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. అయితే తన భూమి చుక్కల భూమిగా నమోదు అయింది. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఒకరి మీద ఒకరు నెట్టివేసుకుంటూ కాలయాపన చేయడంతో పాటు కలెక్టర్ కి ఫైల్ పంపడంలో నిర్లక్ష్యం వహించారు.
ప్రస్తుతం ఆర్సీబి నెం.112/2025, 2025 మార్చి 5న ఫైల్ సంయుక్త కలెక్టర్, నెల్లూరు వారికి పంపినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదు. సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ గిరిజనుల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జిలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు.
గుంటూరు జిల్లా రెడ్డిపాలెంకి చెందిన బిట్రు వెంకయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తను కార్ డ్రైవర్గా పని చేస్తూ గత 30 సంవత్సరాలుగా గుంటూరులో నివాసం ఉంటున్నాను. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొత్తూరు గ్రామంలో తమకు 8 సెంట్లు స్థలం ఉంది. అయితే తన స్థలానికి పక్కనే నివసించే గోసుల వెంకటస్వామి, గోసుల నాగేశ్వరరావు, గోసుల తిరుపాలమ్మ, బిట్ర వెంకయమ్మలు అక్రమంగా తమ ప్రహరీ గోడను విస్తరించి గేటు పెట్టి తన స్థలాన్ని ఆక్రమించారు. తన స్థలంలోకి ప్రవేశం నిరోధించడంతో పాటు అడ్డుపడుతూ బెదిరిస్తూ కర్రలతో దాడి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని తమ స్థలం తమకు ఇప్పించాలని కోరారు.
సత్యసాయి జిల్లా అమడగూరు మండలం బావిచెరువుపల్లి గ్రామానికి చెందిన సీ. లక్ష్మీదేవి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో వ్యవసాయ బోరునకు కొత్త విద్యుత్ సరఫరా కోసం మూడేళ్ళుగా తిరుగుతున్నాను. విద్యుత్ సామాగ్రికి రూ. 79,405 డబ్బులు కట్టాను. సగం మెటిరియల్ ఇచ్చారు ఇంకా సగం ఇవ్వాల్సి ఉంది. లైన్ మెన్ సునీల్ నాయక్ మీ పని కాకుండా చేస్తాను అని బెదిరిస్తున్నాడు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన విధ్యాధరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు గుంటూరు జిల్లా పెందనందిపాడులో 2.16 సెంట్లు పట్టా భూమి కలదు. తమ తల్లి 2025 మే 31న మరణించారు. 1.10 సెంట్ల భూమిని తమ పేరుమీద మార్చుటకు అన్ని పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చాను. 2నెలలు గడుస్తున్నా భూమి తమపేరు మీద మార్చలేదు. సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన మద్దిపాటి రత్నం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమకు వంశపారంపర్యంగా వచ్చిన భూమి ఉంది. పొలానికి సంబంధించిన పాస్ బుక్ ఉంది. పాస్ బుక్ లో మద్దిపాటి రత్నం s/o కృష్ణ అని ఉంది. తర్వాత ఆధార్ కార్డు ఇచ్చారు అందులో మద్దిపాటి రత్నకుమార్ s/o కృష్ణ అని ఉంది. వయస్సు 57 ఏళ్లు అని ఇచ్చారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పొలం విక్రయించాలనుకొంటే ఆధార్ మార్చుకోమని చెప్తున్నారు. పేరు మార్పు కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు