Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ తరఫున ప్రచారానికి వెళ్లలేదని హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరణ!

– నిందితులను శిక్షించాలని టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
– భూ సమస్యలు, నగదు మోసాలతో పాటు వివిధ సమస్యలపై పోటెత్తిన అర్జీదారులు
– అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన టీడీపీ నేతలు

మంగళగిరి: తన కుమారుడికి మెడికల్ సీటు ఇప్పిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులు అడపా ప్రేమ్ చంద్, గుత్తుల అవినాష్, కె.బలరెడ్డి లు తమ వద్ద కోటి 20 లక్షల నగదు తీసుకొని మోసం చేశారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శనివారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలను కలిసి అర్జీ ఇచ్చి ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకొని తనకు డబ్బు తిరిగి ఇప్పించాలని వేడుకున్నాడు. అర్జీలు స్వీకరించిన నేతలు వెంటనే అధికార్లకు ఫోన్లు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

• 2009లో చనిపోయిన వ్యక్తి పేరుతో దొంగ ఆధార్ తీసుకొని 2019లో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి తమ పొలాన్ని విక్రయించారని దీనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలిన బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన నాగబసవపూర్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• తెలుగుదేశం కార్యకర్త అయిన తన భర్తను నడిరోడ్డుపై వైసీపీ రౌడీమూకలు అతి కిరాతకంగా చంపినా పోలీసులు అసలు నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని.. నర్రెడ్డి రవీంద్రారెడ్డి, తలారి బోగాదన్న, బెలుకూరి రాజులు ఇంకా బయటే తిరుగుతున్నారని వీరిపై చర్యలు తీసుకొన తన భర్త మరణానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

• కాకినాడకు చెందిన వీటీ రాయుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. బోసుకొండ రాధా కృష్ణ అనే వ్యక్తి తమ వద్ద రూ.2 కోట్లకు పైగా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు.

• సాయి కిరణ్ హైబ్రీడ్స్ సీడ్స్ వారు తన వద్ద జూట్ విత్తనాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని.. తన సమస్యను పరిష్కరించాలని బాపట్ల జిల్లా యుద్దనపూడి మండలం పోలూరు గ్రామానికి చెందిన చెరుకూరి వీరయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• వైసీపీ పార్టీ మాజీ సర్పంచ్ తమ భూమిని ఆక్రమించుకున్నాడని.. అతని ఆక్రమణ నుండి తమ భూమిని విడిపించాలని కర్నూలు జిల్లా పెద్దకుడుబూరు మండలం పరమానుదొడ్డి గ్రామానికి చెందిన ఎస్. గంగానాయక్ విజ్ఞప్తి చేశారు.

• గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తన కొడుకు ప్రచారానికి వెళ్లలేదని.. తన కుమారున్ని దారుణంగా హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని.. తన కుమారుడి మరణంపై విచారణ చేపట్టి వాస్తవాన్ని బయటపెట్టాలని గుంటూరు జిల్లా పెద్దపలకలూరు గ్రామానికి చెందిన కారసాని వెంకటరత్నం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• సూపర్ మార్ట్ బిజినెస్ ప్రాంచేజ్ ఇస్తానని తన వద్ద రూ. 25 లక్షలు తీసుకొని కొప్పోలు వెంకటగోపికృష్ణ ఫణికుమార్ అనే వ్యక్తి తనను మోసం చేసి వెళ్ళిపోయాడని.. అతనిపై చర్యలు తీసుకొని తనకు డబ్బులు ఇప్పించాలని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన పోతుగంటి నరసింహరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

• తాము కొనుగోలు చేసిన భూములను వైసీపీ కబ్జాదారులతో కుమ్మక్కై డిప్యూటీ కలెక్టర్ దొంగ రిజిస్ట్రేషన్ కు సహకరించారని.. డిప్యూటీ కలెక్టర్ గోర్లియా.. బోళ్ల రాజశేఖర్ రెడ్డి, మల్లిపెద్దు హరికృష్ణలపై చర్యలు తీసుకొని తమ భూమి తమ తమకు దక్కేలా చూడాలని తెనాలికి చెందిన అంచే నాగలక్ష్మి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE