Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పాలనలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం

– వైయస్ఆర్‌సీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ విమర్శ

తాడేపల్లి: ఏడాది కాలంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికరంగం తిరోగమనంలో ఉందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాలేక, గతంలో వైయస్ జగన్ హయాంలో సాధించిన ప్రగతిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కోసం పరిశ్రమలపై కూటమి నేతల రౌడీయిజం కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే….

ప్రతిసారీ చంద్రబాబు తన మేనిఫేస్టోలో అబద్దాలే చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా ఒక అబద్దం. 1999 ఎన్నికల ప్రచారంలో ఇదే చంద్రబాబు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వాటిల్లో కనీసం లక్ష ఉద్యోగాలు అయినా కల్పించారా? ఆయనకు దమ్ముంటే వెల్లడించాలి. అలాగే 2014-19 మధ్య 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించకుంటే నిరుద్యోగభృతి కింద ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2000 ఇస్తానని హామీ ఇచ్చారు. వీటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు.

LEAVE A RESPONSE