యోగా ద్వారా ఆరోగ్యం సంపూర్ణం: కన్నా లక్ష్మీనారాయణ

భారతీయ జనతాపార్టీ గుంటూరు జిల్లా మరియు జిల్లా ఓబీసీ మొర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ అసెంబ్లీలోని 3వ మండలం బ్రాడిపేటలోని లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ ప్రాంగణం నందు బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ & లిటరేచర్ డిపార్ట్మెంట్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్ , OBCkanna మోర్ఛ అధ్యక్షులు అనుమోలు ఏడుకొండలు పర్యవేక్షణలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ,బిజెపి లీగల్ సెల్ చైర్మన్ జూపూడి రంగరాజు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ,నేషనల్ ఆయుష్ బోర్డ్ మెంబర్ బొల్లాప్రగడ శ్రీదేవి ముఖ్య అతిధులుగా యోగా గురూజీ K కొండయ్య మాస్టారు & కేశవ విశ్వకర్మ గురూజీ, మల్లికార్జున్ మాస్టారుల శిష్య బృందం నిర్వహణలో యోగా కార్యక్రమం జరిగినది.

ఈసందర్భంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21 యోగా డే గా గుర్తించేలా చేశారని , అందరికీ ఆరోగ్యం , ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేసుకుంటూ నిత్యం యోగా చెయ్యటం ద్వారా ఆరోగ్యం సంపూర్ణం గా సాధించవచ్చని తద్వారా యోగం పొందవచ్చు అన్నది సిద్ధాంత పరంగా రుజువైందని కూడా తెలియ చేశారు ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం వారి నిత్య జీవితంలో యోగా చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకో వచ్చని ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర బిజెపి లీగల్ సెల్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ యోగా ప్రక్రియ మోక్ష సాధనలో ఒక భాగమని, ధ్యానం లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనకు పునాది అని, ఇలా సాధన చేసే వారిని సాధకులు , యోగులు అంటారని , అలాంటి యోగులలో మానసిక పరిపక్వత కలిగి మంచి మనస్తత్వంతో మనగలరని , అలాంటి తత్వవేత్త మన ప్రధాని నరేంద్ర మోడీ ని, అందువల్లనే దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లగలుగుతున్నారని ” తెలియ చేశారు..

కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ…ఈఉరుకులు పరుగుల జీవితం లో మానసిక ఒత్తిడి , నిద్ర లేమి కారణాలతో సతమత మవుతున్న ప్రజలకు ఈ యోగా అనేది ఆరోగ్య కరమైన శక్తిని పుంజుకునే ఆనందకర ప్రక్రియ , యోగా సాధన చెయ్యటం ద్వారా అన్ని వయసుల వారు బుద్ధి కుశలత కలిగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని తెలియచేశారు . K కొండయ్య గురూజీ వారి శిష్య బృందం చేసిన యోగా కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి .ఈ యోగా కార్యక్రమంలో ఉయ్యాల శ్యామ్ వరప్రసాద్, మకుటం శివ , చరకా కుమార్ గౌడ్ , వనమా నరేంద్ర కుమార్ , పొగతోట రమా కుమారి , కోలా రేణుకా దేవి , కిడాంబి దేవరాజన్ , రమాదేవి , మల్లాల లక్ష్మణ్ , కామేపల్లి వెంకటేశ్వర్లు , రామచంద్రరావు , దుర్గా ప్రసాద్ , అంకాల శ్రీనివాస్ , హనుమ ప్రసాద్ , దర్శనపు శ్రీనివాస్ , వెంకట్ , రమణ , అంకరాజు నరసింహారావు , రాష్ట్ర మీడియా సెల్ కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply