– గోనె సంచులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రిని ఏమనాలి?
– నగరం మండలం ఉత్తరపాలెంలో చంద్రబాబు నాయుడు
– తుఫాను పంట నష్టం పై రైతులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు
తుఫానులో చిక్కుకున్న రైతుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఎక్కడ చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల కొలది దారి వెంబడి చేతికొచ్చే పంట నీట మునిగి కనిపిస్తోంది. ఈ ముఖ్యమంత్రికి కాస్తో, కూస్తో నాలెడ్జ్ కూడా లేదు, ఉంటే రైతులు నష్టపోకుండా చూసేవాడు.
లక్షలాది మంది రైతులు నష్టపోయారు, వారు మళ్లీ కోలుకోవడానికి సమయం పడుతుంది. హుదూద్, తిత్లీ, హరికేన్ తుఫాను రాకుండా చేయలేం కానీ…. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రం తగ్గించగలిగాము. నాడు పది రోజుల పాటు తుఫాను ప్రాంతాల్లోనే ఉండి ప్రజల కష్టాలు తీర్చాను, నా బాధ్యతను మరచిపోలేదు. ఈ ప్రభుత్వానికి అడుగడుగునా నిర్లక్ష్యం అహంకారం వెరసి రైతుల పాలిట శాపంగా మారింది.తెలుగుదేశం హయాంలో పట్టిసీమ తెచ్చి రైతులను ఆదుకున్నాను.
13 లక్షల ఎకరాలకు నీరందించాలని 10 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశాను. పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం. గోదావరి నది జలాల ద్వారా అనేక ఎకరాలు సాగుబడిలోకి వచ్చింది. దుగ్గిరాలలో బసవ పున్నయ్య అనే రైతు 7 ఎకరాల్లో వరి ధాన్యం వేసి.. తుపానుతో నష్టపోయి,ఆదుకునే దిక్కులేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఫసల్ బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఫసల్ బీమా కింద పంటల బీమా వచ్చేది.
కేంద్రం 33 శాతం నిధులిస్తే రాష్ట్రం 33 శాతం ఇచ్చేది, ఆ తరువాత బ్యాంకులుఇన్సూరెన్స్ ఇచ్చేవి. ఇన్సూరెన్స్ వచ్చివుంటే..ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగి ఉండేదికాదు. లక్షలాదిమంది అప్పులపాలయ్యారు. 16 మందికి ఒక ఎకరా ఫసల్ బీమా రికార్డు చేశారంటే సిగ్గుచేటు. నాలుగున్నరేళ్లుగా రైతుల జీవితాలతో ఆడుకున్నాడు.
పంటలకు నీరు ఇవ్వలేదంటే రైతుల మీద కేసులు పెడతారు. మురికి కాలువ తీయలేదంటే వారిపై కేసులు. రోడ్డు, ఇరిగేషన్, వ్యవసాయశాఖలను విధ్వంసం చేశారు. రాజధాని లేకుండా చేసి ఉసురు పోసుకున్నారు. చివరకు గోనె సంచులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రిని ఏమనాలి?
ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందో చెప్పలేని ప్రభుత్వమిది. జగన్ ను ప్రశినిస్తున్నా…ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతుల పంటలకు బీమా చేశారు? ఎంత నష్ట పరిహారం ఇస్తారు? సమాధానం చెప్పండి.