ఆకాశంలో విహరిస్తూ బెజవాడ అందాలు ఆస్వాదిద్దాం

ప్రారంభమైన హెలిరైడ్ 
ఈనెల 9 నుంచి 17వ తేది వరకు ప్రతీ రోజు ఉ.10 నుంచి సా.5 వరకు
విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు హెలికాఫ్టర్ లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని జిల్లా యంత్రాoగం, పర్యాటకశాఖ, నగర మున్సిపల్ కార్పొరేషన్. శ్రీ దుర్గామలేశ్వర స్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలి రైడ్ విహంగ సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రజిత్ భార్గవ్,జిల్లా కలెక్టర్ జె. నివాస్,నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు,సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఏవియషన్ కార్పొరేషన్ యండి భరత్ రెడ్డి,వియంసి కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్,సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్,ఆలయ ఈవో డి.భ్రమరాంబ, తదితరులు పాల్గొన్నారు. 6 నిమిషాలపాటు విహంగ యాత్రకు రూ. 3500/- మరియు 13 నిమిషాలకు రూ. 6000/- ధరను నిర్ణయించారు.
ఈ హెలి రైడ్ ఈ నెల 9 నుంచి 17వ తేది వరకు నిర్వహిస్తారు. ఆ తేదీల్లో ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలిరైడ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.సన్ రైజ్ ఎయిర్ ఛార్టర్ సంస్థ, తుంబై ఎవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ భాధ్యతలను చూస్తారు. దుర్గమ్మ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ కె. నివాస్ తెలిపారు.

Leave a Reply