రాష్ట్రంలో పొత్తులు ఎత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘మా స్థాయిలోనే మేము వెళ్తాం. బీజేపీ ఎక్కడా లయ తప్పే పార్టీ కాదు. ఏ సందర్భంలోనైనా రాష్ట్ర ప్రజల కోసమే సీఎం జగన్కు బీజేపీ సాయం చేస్తుంది. వ్యక్తిగత ఆపేక్షలు ఎక్కడా ఉండవు. ఆయన వ్యవహార శైలి డిఫరెంట్’ అని అన్నారు.