ఆయన పిలుపే ఓ ప్రభంజనం

-పేదలకోసం జీవితం త్యాగం చేసిన ఎన్.టి.ఆర్. 36సంవత్సరాల అవినీతి కాంగ్రెస్ కు ఎన్.టి.ఆర్ రాకతో చరమ గీతం పాడిన 10 కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు
-రండి.. కదలిరండి.. ఆయన పిలుపే ఓ ప్రభంజనం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే కాంగ్రెస్ పీడిత పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు
(నందమూరి రామకృష్ణ)

ఆయన ఇదే రోజున మొదటి సారి కాంగ్రెసేతరా ముఖ్యమంతిగా ప్రమాణం చేసి 40 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా ఆ మహానుభావుణ్ణి స్మరించుకుందాం. తెలుగువాడి ఉనికి కోసం జీవితాంతం కృషిచేసి ప్రపంచ గుర్తింపు పొందిన ఎన్.టి.ఆర్. వెండితెర ఇలవేల్పుగా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారు. సినీ అగ్రనటునిగా విపత్తుల సమయంలో జోలిపట్టి ప్రజలను ఆదుకున్నారు. అప్పటి ప్రభుత్వాలకు ఆర్థిక సహకారం అందించారు. అలాంటి మనసున్న గొప్ప నటుడిని, రాజకీయాల్లోకి వచ్చాక తారక రామునిగా భావించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం పై తెలుగుదేశం అధినేతను చరిత్ర పుటల్లో గుర్తుపెట్టుకొనే విధంగా అనతి కాలంలోనే కూర్చో బెట్టారు.

పేద, బడుగు, బలహీన, మైనారిటీ ల కోసం ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో పేదప్రజలు గుర్తు పెట్టుకునే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పేదవానికి పట్టెడు అన్నం పెట్టె కిలో 2. రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, పక్క గృహాలు,50. రూపాయలకే రైతుకు విద్యుత్, తెలంగాణాలో పేదలను పీడించే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకు మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో హక్కు, మహిళా రిజర్వేషన్లు, యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేశారు. చట్ట సభల్లో విద్యావంతులకు అధిక సంఖ్యలో పెద్దపీట వేశారు. మరి ముఖ్యంగా సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. 1983, 1985 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్.టి. ఆర్. 1994లో మూడవసారి ముఖ్యమంత్రి గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఘనమైన మెజారిటీని టీడీపీ సాధించింది, అంతటి ఘనత సాధించిన చండశాసనుడు ఎన్.టి.ఆర్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

అంతటి గొప్ప విజయాలను ఎన్. టి. ఆర్ సాధించటానికి ప్రధాన కారణం నిరంతర కృషి, పట్టుదల, అలుపెరగని పోరాటం, పేదలకోసం పాటు పడటం, నిజాయితీ క్రమశిక్షణ, మరి ముఖ్యంగా రామదoడు లాంటి సుషీక్తులైన ప్రాణసమానులైన కార్యకర్తలు అనటంలో సందేహం లేదని అన్న గారు అనేక సందర్భాలలో గుర్తు చేసుకున్నారు.

తన సభలకు భారీగా తరలి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను, మహిళలను ఉద్దేశించి ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ నా తెలుగింటి ఆడ పడుచులకు, నా ప్రాణ సామానులైన కార్యకర్తలకు వందనం..అభివందనం అని ప్రసగించే వారంటే కార్యకర్తలన్న, మహిళలన్న ఎన్.టి.ఆర్.కు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాణుక్యుని గాను, చంద్రగుప్తిని గాను రాణించిన ఎన్.టి.ఆర్. దేశ రాజకీయాలను శాశించారు.

దేశంలో కాంగ్రెస్ ఏతర పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి దేశంలో ప్రజల, పార్టీల నాయకుల దృష్టిలో కధనాయకుడయ్యారు. దేశంలో కాంగ్రెస్ అధిష్టానంకు చెమటలు పట్టించిన ఏకైక గొప్ప మహమనిషి నందమూరి తారక రామారావు. తన చరిష్మా తో కాంగ్రెస్ ఏతర ప్రధానిగా పనిచేసే అవకాశం వచ్చిన ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ధేయంగా పనిచేసారు.

తన స్థానంలో ప్రధానులుగా హెచ్. డి. దేవేగౌడ, చంద్రశేఖర్ వంటి నాయకులను ప్రధానులను చేసారు ఎన్.టి.ఆర్. అలాంటి గొప్ప నాయకుడు, దార్శనికుడు, సంక్షేమ సారధి, అవినీతిమచ్చ లేని నేత , ప్రజాహృదయనాదస్వరుడు, ఎన్.టి.ఆర్. లాంటి మహానేత, ఆయన కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో వున్నారంటే నేటి రాజకీయ తరం నమ్మలేరు అనటంలో అతిశయోక్తి కాదు.

అలాంటి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఎన్.టి.ఆర్. చూపిన బాటలోనే నడుస్తూ టీడీపీ ని, తెలుగుజాతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి నాయకునికి ప్రజలు, కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలవాలి. తెలుగుజాతిని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి , తెలుగుజాతి అభివృద్ధికి బాటలు వెయ్యాలి. అద్భుత, అఖండ విజయాలు ఎన్నికల్లో సాధించి అన్న ఎన్.టి.ఆర్. ఆత్మకు శాంతి చేకూర్చాలి.
జయహో ఎన్. టి. ఆర్…. జోహార్ నందమూరి తారకరామారావు.

Leave a Reply