విజయనగరం: ఏపీ క్షత్రియ ఫెడరేషన్ విజయనగరంలో నిర్వహించిన క్షత్రియ ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమం దృశ్యం. చిత్రంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తదితరులు. ఈ సందర్భంగా ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన 7 గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని క్షత్రియ ఫెడరేషన్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.