Suryaa.co.in

Telangana

130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది?

– ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు.
– అబద్ధం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది
– నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్: ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది? చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు ? కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.

కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనుకకు వెళ్లే దుస్థితి ఏర్పడింది. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే, అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. తాము చెప్పినవాళ్ళకే పథకాలు వస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువకాలం పరిపాలించలేరు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. యూరియా కోసం రైతులు మళ్లీ లైన్లు కట్టే పరిస్థితి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందా ఎప్పుడు పోతుందా అన్నది తెలియని దుస్తితి ఏర్పడింది.

చెరువులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం. పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే ఇంకా ఇస్తున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లల స్కూటీలు ఏమైయ్యాయి ? కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర, దగా చరిత్ర.
కేసీఆర్ అర్హులైన అందరికీ పారదర్శకంగా పథకాలను అందించారు. కేసీఆర్ హయాంలో నేరుగా లబ్దీదారులకే కోట్లాది రూపాయలు వెళ్లాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను తామే చెశామని చెప్పడమే తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.

ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ్యతకుగురికావడం బాధాకరం. కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE