Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధిని ఓర్వలేని వైసీపీ రాక్షసులు!

– ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్

విజయవాడ : గడిచిన ఏడు నెలల్లో ఏడేళ్ళ అభివృద్ధిని చేసి చూపించిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం అర్బన్ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు పూర్తి కాని, మరమ్మతులు చేయలేని గ్రామ, పట్టణ, రాష్ట్ర రహదారులను పూర్తి చేసి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు.

ఓ వైపు అప్పుల కుప్ప, మరో వైపు జగన్ రెడ్డి పెట్టి పోయిన బకాయిల తట్ట దర్శనమిస్తున్నా, హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల మన్ననను కూటమి ప్రభుత్వం పొందుతుందన్నారు. నవరత్నాల్లో ఒక్క హామీని కూడా మొదట ఆరు నెలల్లో జగన్ రెడ్డి పూర్తి చేయలేదని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అనేక హామీలను అమలు చేశామన్నారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ రాక్షసులు కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతున్నారన్నారు.

LEAVE A RESPONSE