మెగా డీఎస్సీ అని సుమారు 16 వేలమంది నిరుద్యోగులను ఉపాధ్యాయులుగా నియామకాలు ఇచ్చేవరకు బావుంది.
మా ఏడుపు గొట్టు జగన్ జీర్ణం చేసుకోవాలి కదా?
బుడుక్కున వచ్చే నెలలో టెట్, 2026 జనవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ అని అలా మానవత్వం లేకుండా ప్రకటించేస్తే.. మా జగనన్న రావుగోపాలరావు లెక్కన పన్నే కుట్రలు ఏమవ్వాలి?
“(సాక్షి స్క్రోలింగ్) తాడేపల్లి : వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్ధులు – DSC-2025ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని విజ్ఞప్తి – రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని కోరిన అభ్యర్ధులు – నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందన్న డీఎస్సీ అభ్యర్థులు – జీవో 77 రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి – సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్”
* * *
గ్యాప్ ఇస్తే.. మొన్న ఉద్యోగాలు రాని వారిలో మొద్దులను పిలిపించి ఇలా వారిలో విషబీజాలు నాటి వారి నోట్లో మన్నుకొట్టే లోపల.. ఇలా వ్యవహరిస్తే జగనుకు రఫ్ఫా రఫ్ఫా పిలుపు ఇవ్వడం తప్ప, వేరే ఆప్షన్ ఏముంది అని ఆలోచించారా?
* * *
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, ప్రతి ఏటా DSC ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటన అభ్యర్థులలో నమ్మకాన్ని పెంచుతుంది.
నిర్ణీత సమయపాలన: రాబోయే DSC పరీక్షకు సంబంధించి ఖచ్చితమైన సమయపాలన ప్రకటించారు:
* నవంబర్ చివరి వారంలో TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్).
* 2026 జనవరిలో DSC నోటిఫికేషన్.
* 2026 మార్చిలో DSC మరియు స్పెషల్ DSC నిర్వహణ.
* కొత్త డిఎస్సీ ద్వారా నియామకమయ్యే ఉపాధ్యాయులు తరువాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.
మంత్రి లోకేష్ స్వయంగా TET, DSCలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు,
ఉపాధ్యాయ నియామకాలతో పాటు, విద్యారంగంలో ప్రకటించిన మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు:
రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 (ఇది దేవుడి స్క్రిప్టా కావాలని చేశారా?) జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇది విద్యాసంస్థల సంఖ్య పెరగడం ద్వారా మరిన్ని విద్యావకాశాలు లభిస్తాయనే ఆశ కల్పిస్తుంది.
మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సింగపూర్ పర్యటనకు పంపించాలని నిర్ణయించారు. ఇదేమన్నా బావుందా వైన్ షాపుల దగ్గర గురువులని వాడుకోవాలి గానీ.
హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రణాళికలు, జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునీకరణకు ప్రణాళికలు.
జీవో ఇచ్చి వాలంటీటీర్లకు, గ్రామ సచివాలయాలకు సాక్షి వేసి విజ్ఞానం పంచే అద్భుతాల బదులు ఇదేంది?
* * *
మా తులసీ చంద్, తెలకపల్లి కామ్రేడ్, మా ఎర్నలిస్టుల నుండి వైకాపా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సమాజం ఇలాంటివి సహించవు.
దృశ్యం: 5 రూపాయల పనిలో డీఎస్సీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కాకుండా వందలోపు ఉండవచ్చు. కానీ వారిని కలుస్తా అని స్క్రోలింగులు వేసి, ఇలా వ్యవహరించినా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయడాన్ని జగన్ వెళ్లాక రికార్డ్ చేయడం చాలా చాలా చాలా బావుంది.
* * *
ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకోండి. ఆ కాలం పోయింది. ఒక పెయింటర్ కుటుంబాన్ని పోషిస్తూ.. ఎలా ర్యాంక్ సాధించి ఉద్యోగం తెచ్చుకొన్నాడో తెలుసుకోండి. చదువుకుని కూడా … తోక పట్టుకుని గోదావరిని ఈదాలి అంటే ఆల్ ది బెస్ట్.