అప్పులు తేవడం.. ఆ సొమ్ముని దారిమళ్లించడం చేస్తే రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?

3

– బడ్జెట్ లో కేటాయింపులకు, క్షేత్రస్థాయిలో ఖర్చులకు ఎక్కడా పొంతనఉండటం లేదు
– ప్రభుత్వం గొప్పగాచెప్పుకునే డీ.బీ.టీలో రాష్ట్రం, దేశంలో 19వస్థానంలో ఉంది
• 2023-24 బడ్జెట్ లో ఎలాంటి కొత్తదనం లేదు. ఆఖరి ఏడాదిలో కూడా జగన్ ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
• జగన్ నీరోచక్రవర్తి కంటే దారుణమైన రాజు
• వైసీపీప్రభుత్వం దిగిపోయేనాటికి ప్రజలపై పడే రాష్ట్రఅప్పులభారం రూ.11లక్షలకోట్లు దాటిపోతుంది. ఆ అప్పులు, వడ్డీలభారం అంతా ఎప్పటికైనా ప్రజలే కట్టాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

బడ్జెట్ లో ఎలాంటికొత్తదనం లేదని, 2023-24 బడ్జెట్ గవర్నర్ ప్రసంగాలు చూస్తే, వైసీపీ ప్రభుత్వం ఆఖరిఏడాదిలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతఇవ్వలేదని తేలిపో యిందని, గత నాలుగుబడ్జెట్లలో అనుసరించిన పంథానే అనుసరించిందని, ఇతరరాష్ట్రాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం కేపిటల్ ఎక్సెపెండేచర్ కు పెడుతున్నఖర్చు చాలాతక్కువని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“జగన్ ప్రభుత్వం ఏటాప్రవేశపెట్టే బడ్జెట్లలో అంకెలు ఘనంగా చూపుతూ, ఖర్చుమాత్రంచాలా తక్కువ పెట్టడంవల్లే రాష్ట్రంలో ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. దాన్నిమెరుగుపరచడా నికి కూడా తాజాబడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పోయినసారి కేపిటల్ ఎక్స్ పెండేచర్ కు రూ.33వేలకోట్ల పైచిలుకు బడ్జెట్లో పెట్టారు, కానీ రూ.7వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. కేపి టల్ ఎక్స్ పెండేచర్ కు ఖర్చుపెట్టేదానిలో కొంతజీతాలకు పోతోంది. దాన్నిబట్టి ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు పెడుతున్నఖర్చు చాలాచాలా తక్కువనే చెప్పాలి. ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ క్రియే ట్ చేయడంలో వైసీపీప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. చివరిగా ఎన్నికలఏడాదిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టిందే ఈ ప్రభుత్వానికి లాస్ట్ బడ్జెట్ . దీనిలోనే అన్నిశాఖలకు అత్తెసరు కేటాయింపులతో సరిపెట్టారు.

ముఖ్యమంత్రి గొప్పులు చెప్పుకునే డీ.బీ.టీలో దేశంలో రాష్ట్రస్థానం ఎంత?
ఆర్థికమంత్రి మాట్లాడుతూ, డీ.బీ.టీ (డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ ఫర్) కు రూ.54వేలకోట్లు కేటాయించినట్టు చెప్పారు. డీ.బీ.టీలో దేశంలో వైసీపీప్రభుత్వ స్థానమెంత? ఇప్పుడు ప్రక టించిన బడ్జెట్ కేటాయింపులుచూస్తే, 2022-23తో పోలిస్తే చాలాపథకాలు తీసేశారని అర్థమ వుతోంది. రాష్ట్రంలో ఉన్న జనాభాకు ప్రభుత్వం సంక్షేమానికి చేసిన కేటాయింపులకు ఎక్క డా సంబంధంలేదు. సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గ్రోత్ లో రాష్ట్రం 13వస్థానంలోఉంది. డీ.బీ .టీ అమల్లో 19వస్థానంలో ఉంది. వైసీపీప్రభుత్వంలో ఆర్థికఅసమానతలు బాగా పెరిగాయి. సంక్షేమానికే ఎక్కువనిధులు వెచ్చిస్తే, పేదరికం ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలి.

విద్య, వైద్యరంగాల్ని నాశనం చేశారు…
మానవ అభివృద్ధికి విద్య, వైద్యరంగాలే ప్రధానం. కానీ ఆరెండు రంగాల్నే జగన్ సర్కార్ నిర్ల క్ష్యం చేస్తోంది. 2022-23 బడ్జెట్ తో పోలిస్తే, వైద్యరంగానికి తాజాబడ్జెట్లో కేటాయింపులు తక్కువచేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడంలేదు. దాంతో ఆసుపత్రులు యాజమాన్యాలు రోగుల్నిచేర్చుకోవ డంలేదు. సరైనవైద్యసేవలు అందక బలహీనవర్గాల ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. రాష్ట్ర జీ.ఎస్.డీ.పీలో వైద్యరంగానికి 4శాతం నిధులు కేటాయించాలని 15వ ఆర్థికసంఘం స్పష్టం చేస్తే, ఈ ప్రభుత్వం కేవలం ఒకశాతమే కేటాయించింది. మానవఅభివృ ద్ధి సూచీలో రాష్ట్రం 21వస్థానంలో ఉంది. పాఠశాల విద్యనుంచి ఉన్నతవిద్యవరకు అంతా నాశనంచేశారు. ప్రాథమికపాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనంచేయడం, ఉపాధ్యాయ పోస్టుల్నిభర్తీచేయకపోవడం, ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము విద్యాసంస్థలకు ఇవ్వకపోవ డం, నాడు-నేడు పేరుతో జరిగినదోపిడీ, వంటివి విద్యారంగాన్ని ప్రభావితంచేశాయి. అమ్మ ఒడి పథకాన్ని అందరికీ అమలుచేయడంలేదు. అమ్మఒడి పేరుతో ఫీజు రీయింబర్స్ నిధులు ఆపేశారు. అమ్మఒడిసొమ్ముని సొంత అవసరాలకు ఖర్చుపెట్టుకోవడంవల్ల, కళాశాలల్లో ప్రవే శాలు తగ్గిపోయాయి. పేదలకు సంపాదనతగ్గి, ఖర్చులు పెరిగాయి. దాంతో పొదుపు చేయ డం తగ్గిపోయింది. ఖర్చులు భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆదాయార్జన రంగాలన్నీ దెబ్బతిన్నాయి…
జీఎస్టీలో కరెంట్ ప్రైసెస్ .. కాన్ స్టెంట్ ప్రైసెస్ అని రెండురకాలుంటాయి. కాన్ స్టెంట్ ప్రైసెస్ గ్రోత్ లో ఏపీప్రభుత్వం మైనస్ లో ఉంది. కరెంట్ ప్రైసెస్ గ్రోత్ 11శాతం పెరిగిందని చెబుతున్నారు. కానీ వాస్తవాలుచూస్తే వ్యవసాయరంగంలో లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్, హార్టీ కల్చర్ ప్రధాన గ్రోత్ ఇంజన్లు. టీడీపీప్రభుత్వంతో పోలిస్తే, లైవ్ స్టాక్ గ్రోత్ -6.5శాతం. ఆక్వాకల్చర్ –14శాతం, మొత్తం వ్యవసాయంవిభాగం చూస్తే, -48శాతం గ్రోత్ రేట్ లో ఉంది. టీడీపీప్రభుత్వంలో ప్లస్ లో ఉంటే ఇప్పుడు మైనస్ లోకి వచ్చింది. మ్యాని ఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాలు పరిశ్రమలకు చాలాకీలకం. టీడీపీప్రభుత్వంతో పోలిస్తే మ్యాని ఫ్యాక్చరింగ్ రంగం -4.5శాతంలో ఉంది. కన్ స్ట్రక్షన్ -2.6శాతం, మొత్తంగా ఇండస్ట్రియ ల్ సెక్టార్ -1.4శాతం, సర్వీస్ సెక్టార్-1.7శాతం గ్రోత్ కి పరిమితమయ్యాయి. ఎం.ఎస్.ఎం. ఈలు మూతపడేపరిస్థితి. ఉన్నపరిశ్రమలకే ఇన్సెంటివ్స్ ఇవ్వలేనివారు, కొత్తపరిశ్రమలు తీసుకొస్తారా? ఇండస్ట్రియల్ సెక్టార్ కుంటుపడటంతో నిరుద్యోగం పెరిగింది. అన్ ఎంప్లాయ్ మెంట్ లో8.5 శాతంతో దేశంలోనే రాష్ట్రం2వస్థానంలో ఉంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఉత్తుత్తిహంగామాలకే పరిమితమయ్యారు. దాదాపు 3లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీ చేయా ల్సి ఉంది. టీడీపీప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగభృతి కూడా ఆపేశారు. ప్రభుత్వ పాలసీలతో సర్వీస్ సెక్టార్ దెబ్బతిన్నది, ప్రధానరంగాలైన రియల్ ఎస్టేట్, ఐటీ, టూరిజం దెబ్బతిన్నాయి. జీ.ఎస్.డీ.పీ గ్రోత్ కు అప్పులకు సంబంధంలేదంటే ఎలా? ఆర్థికపరమైన అభివృద్ధిరేటు తగ్గిపోతుంటే, రాష్ట్రంఅప్పులు పెరుగుతున్నాయి. 2024-25 నాటికి 11లక్షలకోట్ల అప్పులు లెక్కచూపేలా ఉన్నారు. దానికి కట్టేవడ్డీనే దాదాపు రూ.40వేలకోట్లకు చేరుతోంది. కార్పొరేట్ బారోయింగ్స్ ని కూడా బడ్జెట్లో చూపాలని 15వఆర్థికసంఘంచెబితే, వీరు ఆపనిచేయడం లే దు. అప్పులు, నిరుద్యోగంపెరిగి, ఆదాయం తగ్గిపోతుంటే, రాష్ట్రఆర్థికపరిస్థితి బాగుందని ఎలా చెబుతారు? లక్షలకోట్ల అప్పులకు తగినట్టు జీ.ఎస్.డీ.పీ గ్రోత్ లేదు.

అప్పులు తెస్తున్న సొమ్ముని రాష్ట్రం కోసం, ప్రజలకోసం కాకుండా సొంతానికి వాడుకుంటున్నారు
అప్పుల్ని ప్రొడక్ట్ యాక్టివిటీ పెట్టాలన్నదే గ్రేట్ ఎకనమిస్ట్ ప్రొఫెసర్ కీన్స్ థియరీ. ప్రభుత్వం అన్ ప్రొడక్ట్ యాక్టివిటీలో పెట్టింది. బడ్జెట్లో ఫిజికల్ డెఫిషిట్ రూ.55వేలకోట్లుగా చూపారు. ఆర్.బీ.ఐ, కాగ్, కేంద్రప్రభుత్వం లాంటి వ్యవస్థలన్నీ అప్పులతో మునిగిపోతున్నారని చెబు తుంటే, ప్రభుత్వం మాత్రం లేదని బుకాయిస్తోంది. నిండా మునిగినవారికి ఎవరెన్నిచెప్పినా తలకు ఎక్కడంలేదు. అసెంబ్లీ పాస్ చేసిన బడ్జెట్ నిధుల్ని దారిమళ్లించి, ఇష్టానుసారం నిధు లు ఖర్చుపెట్టేస్తున్నారు. అసెంబ్లీలో చెప్పినప్రకారమే నిధులుకేటాయింపులు, ఖర్చులు ఉం డాలి. రెవెన్యూ డెఫిషిట్ చూస్తే, టీడీపీప్రభుత్వం మొదలైనప్పుడు రూ.16వేలకోట్లుఉంది. దానిలో కేంద్రప్రభుత్వం రూ.12వేలకోట్లుఇచ్చినట్టుంది. రాష్ట్రవిభజనకష్టాలు ఉన్నాకూడా టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి (2018-19) రెవెన్యూ డెఫిషిట్ రూ.13వేలకోట్ల చిల్లర ఉం ది. ఇప్పుడు వైసీపీప్రభుత్వం రూ.28వేలకోట్లు చూపుతోంది. ప్రతిఏటా రెవెన్యూ డెఫిషిట్ తక్కువగా చూపుతున్నారు. ఫిజికల్ డెఫిషిట్ కూడా విపరీతంగా పెరుగుతోంది. ఓపెన్ బారో యింగ్స్ ఎక్కువ వడ్డీకి తెస్తున్నారు. కార్పొరేట్ బారోయింగ్స్ నిధుల్ని ప్రజలకోసం కాక, సొం తానికి వాడుకుంటున్నారు. మొత్తంకలిపి అంతిమంగా భారమంతా ప్రజలపైనే పడుతుంది. గ్యారంటీస్ బారోయింగ్స్ ని కూడా 90శాతంనుంచి 180శాతానికి పెంచారు. ఇవన్నీ కలిపి రాష్ట్రం ఆర్థికంగాకుప్పకూలింది. ప్రభుత్వం ఇన్నిసంవత్సరాలనుంచి తెచ్చిన అప్పులు ఏమ య్యాయి? ఈ బడ్జెట్ చూశాక ప్రజలకుకూడా, ప్రభుత్వంపై ఉన్నఆశపోయింది. అప్పులు, కేంద్రప్రభుత్వమిచ్చే డబ్బుపైనే రాష్ట్రప్రభుత్వం ఆధారపడుతోంది. ప్రజలు తిరగబడితే సివిల్ వారే వస్తుంది. అదిఎన్నికలప్పుడు ప్రభుత్వానికి అర్థమవుతుంది. రోడ్లపై గుంతలు పూడ్చ లేని ప్రభుత్వం మౌలికవసతులభివృద్ధికి ఏం ఖర్చుపెడుతున్నట్టు?

విలేకరులు అడిగినప్రశ్నలకు సమాధానంగా… యనమల స్పందన
జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహంచేసినట్టు, పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో నిరూ పితమైంది. జగన్ మనీపాలిటిక్స్, మజిల్ పవర్ పైనే ఆధారపడుతున్నాడు. ఆరెండూ కూడా పనిచేయవనిచెప్పడానికి తాజాఫలితాలే నిదర్శనం. భవిష్యత్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆరెండూ పనిచేయవు. నీరోచక్రవర్తి క్రూడ్, మ్యాడ్ ఎంపరర్. అతను తల్లినే చంపించాడు. అలాంటి రాజులుకూడా ప్రజలతిరుగుబాటుకు బలయ్యారు. ఎంతక్రూరత్వం ప్రదర్శించినవారైనా ప్రజాస్వామ్యంలో పతనంకావాల్సిందే. ప్రజల్ని, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్న జగన్ కు కూడా అదేగతి పట్టనుంది. రాజధాని అంశం కోర్టులో ఉంటే, దానిగురించి ముఖ్యమంత్రి ఎలామాట్లాడతారు? న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రవ్యవస్థ. చట్టా లన్నా, రాజ్యాంగమన్నా ప్రభుత్వానికి లెక్కలేదు. ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అనేది అన వసరం. కానీ రాజధాని అనేది ఒక్కటే ఉంటుంది. పార్లమెంట్ లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను మారిస్తేతప్ప, రాజధాని మార్చడం కుదరదు. కోర్టులు కూడా అదేచెబుతాయి. రాజధాని మార్చడం అనేది ఎట్టిపరిస్థితుల్లో సాధ్యంకాదు.

ఉత్తరాంధ్ర ప్రాంతం చాలాప్రశాంతమైనది, అక్కడ ఉండేవారు అంతా ఎక్కువ మధ్యతరగతివారే. అలాంటిప్రాంతంలో భూకబ్జాలు చేయ డం, దోపిడీ, రౌడీయిజానికి పాల్పడితే, ప్రజలు ఊరుకుంటారా? తమప్రశాంతతను వైసీపీ ప్ర భుత్వం భగ్నంచేసిందన్న ఆవేదన, బాధ ఉత్తరాంధ్రవాసుల్లో ఉన్నాయి. దానిప్రభావమే ఎమ్మెల్సీఎన్నికల్లో అధికారపార్టీ ఓటమి. అప్పులుచేయడాన్ని తాముతప్పుపట్టడంలేదు. ఆ సొమ్ముతో అభివృద్ధిచేసి, తిరిగిఆధాయం వచ్చేలా చేయాలి. కానీ ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చి, సొంతానికి వాడుకుంటే, ఆభారం ప్రజలపైపడదా? ప్రజలపై విపరీతంగా పన్నులేస్తూ, విద్యుత్, ఆర్టీసీఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచగా వచ్చినసొమ్ము, ఇసుక, మద్యం, మైనింగ్ ద్వారా వస్తున్న సొమ్ముని ఏంచేస్తున్నారు” అని యనమల ప్రశ్నించారు.