భ్రమాజనిత లోకంలో ఎంత కాలం బతుకుతావు, భయ్యా?

Spread the love

-2024 ఎన్నికలపై ‘కుప్ప’మయ్య మెదడులో పుడుతున్న ‘సానుకూల అంచనాలు’
భ్రమాజనిత లోకంలో ఎంత కాలం బతుకుతావు, భయ్యా?
(ఎంపి విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)

నారా వారికి కాస్త హుషారొచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తిరిగొచ్చిన మాజీ ముఖ్యమంత్రికి భవిష్యత్తుపై ఆశ చిగురించింది. తన బహిరంగ సభలకు కాలక్షేపానికి వచ్చిన జనం చంద్రబాబు నాయుడు గారిలో కొద్ది పాటి ఉత్సాహం నింపారు. కాని, అమరావతికి వచ్చేసిన రెండు మూడు రోజులకు టీడీపీ అధినేతకు కర్నూలు, ఎమ్మిగనూరు ర్యాలీల జనమే కళ్లు తెరిచినా మూసినా కనిపిస్తున్నారు. ఫలితంగా, ఈ మాజీ హైటెక్‌ సీఎం మెదడు ఆకాశంలో విహరిస్తోంది. అంతా ఆశావహమైన కలలు కంటోంది. నిన్న జరిగిన ఆక్వా రైతుల సదస్సు పేరిట జరిగిన రాజకీయ తమాషాలో ఆయన మాటల్లో తెచ్చిపెట్టుకున్న ‘విజయోన్మాదం’ కనిపించింది.

తన ‘కర్నూలు దెబ్బ’తో పాలకపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సంక్షోభం బాబు గారికి కనపించిందట. పార్టీ పదవులు ఇస్తామన్నా అక్కడి నేతలు వద్దని చెబుతున్నారట. అందుకే, 2024 ఎన్నికల్లో పాలక పార్టీకి కుప్పం సంగతి దేవుడెరుగు, పులివెందులలో కూడా గెలుపు గగనమేనని ఈ మాజీ ‘గ్లోబల్‌ నాయకుడి’కి అనిపిస్తోందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి బదులు సీఈఓ అని ప్రకటించుకోవడానికే అధికారంలో ఉండగా ఇష్టపడిన ‘చంద్రగిరి చంద్రన్న’కు ఏదో అయిపోతోంది.

ఆయనను ‘భ్రమాజనిత లోకంలోకి’ ఎవరో నెట్టేస్తున్నారు. లేకుంటే ఆయన వచ్చే ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లూ నావే–అని ఎలా అంటారు? తప్పదు, చంద్రబాబు గారి మానసిక రుగ్మతలకు తక్షణమే చికిత్స చేయించాలి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఒక్క పర్యటనతోనే ‘మతి చలించిన’ చంద్రయ్యకు మరి 2023లో ఇంకా ఇలాంటి ఊహించని షాకులు ఎన్ని తగులుతాయో మరి? తన మామ గారు ఎన్‌.టి.రామారావు పెట్టిన తెలుగుదేశం అభ్యర్థి చేతిలో చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయి రేపొచ్చే జనవరికి 40 ఏళ్లు నిండుతున్నాయి.

అందుకేనేమో ఆయన ఓటమి మాటలతో ఈ 2022 నవంబర్‌ మాసాన్ని మొదలుబెట్టి, గెలుపు కబుర్లతో ముగించేలా ఉన్నారు. ‘వచ్చే ఎన్నికలే నా రాజకీయ జీవితానికి చివరివి, అప్పుడు తెలుగుదేశం ఓడిపోతే నాకు ఇక ప్రజాజీవితం ముగిసినట్టే,’ అనే తీరున టీడీపీ నాయకుడు జనాన్ని బెదిరించాలని చూసి బొక్క బోర్లాపడ్డారు. ఓటమి దర్శనమిచ్చే ఈ మానసిక నుంచి స్థితి నుంచి నెమ్మదిగా అమరావతిలో ఆయన కోలుకున్నట్టు కనిపిస్తోంది.

‘పరాజయ పర్వం’ నుంచి బయటపడి ఇప్పుడు తన పార్టీ ఎన్నికల విజయంపై అంచనాలు చెబుతున్నారు. మంచిదే గాని, అక్కడితో ఆగకుండా ఆయన తన ప్రత్యర్థి రాజకీయపక్షం అంతర్గత విషయాలపై నోటికొచ్చినట్టు మాట్లాడడం కుప్పం ఎమ్మెల్యేగారి వింత మానసిక ధోరణికి దర్పణం. సరే, కర్నూలులో పుట్టిందని చెబుతున్న ఈ భ్రమాజనిత లోకంలో సీనియర్‌ మోస్ట్‌ మాజీ సీఎం గారు ఎన్ని మాసాలు జీవిస్తారో చూద్దాం.

Leave a Reply