– 2001 లో పార్టీ పెట్టినపుడు కవిత లేరు
– కేసీఆర్ అంటే బీ ఆర్ ఎస్ .బీ ఆర్ ఎస్ అంటే కేసీఆర్
– రేవంత్ రెడ్డి డైరక్షన్ లో కవిత
– శివుడుకి నంది లాంటి వ్యక్తి కేసీఆర్ కి హరీష్ రావు
– బీఆర్ఎస్ కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు
– బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ,మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా కవిత గారు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాము. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రెండు. మూడు నెలలుగా కవిత తన తీరుతో పార్టీ కి ఎంతో నష్టం చేశారు. మహా శివుడుకి నంది లాంటి వ్యక్తి కేసీఆర్ కి హరీష్ రావు. బీఆర్ఎస్ కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు. ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా ?
జలదృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు. ఏ పనిచెప్పినా ఎదురు మాట్లాడకుండా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు. కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి . నాడు హరీష్ రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఎలా మనసు ఒప్పుతుందో అర్ధం కావడం లేదు.
ఈటల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదు. 2004 ఉప ఎన్నికలో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి దినదినం ప్రజాభిమానం పొందారు. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారు. కవిత హరీష్ రావు ని టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడమే కాకుండా, రేవంత్ కాళ్లు మొక్కాడని చెప్పడం చాలా బాధగా అనిపించింది. అసలు ఈ ఆరోపణలను తెలంగాణ సమాజం నమ్ముతుందా ? ఇంత అర్ధరహితంగా ఆరోపణలు చేస్తారా ? రేపు కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే ఇలాగే ఆరోపణలు చేస్తారా ? వాళ్లకు కష్టం వచ్చినప్పుడు పార్టీ అండగా నిలబడింది.
కాళేశ్వరం ఎత్తిపోతల అనుమతుల కోసమే మహారాష్ట్రకు 25 సార్లు వెళ్లారు. ఏ శాఖను ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను సభలో, బయటా ఎండగడుతున్నది హరీష్ రావు. హరీష్ రావు మీద ఆరోపణలు చేయడం మూలంగా ఎవరికి లాభం చేకూరుస్తున్నారు ? బీ ఆర్ ఎస్ శ్రేణులను కవిత బాధకు గురి చేశారు.
పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే, పార్టీ శ్రేణులు ముఖ్యమని కేసీఆర్ నిరూపించారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ సందేశం ఇచ్చారు. హరీష్ రావు గురించి కవిత గారు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. హరీష్ రావు కేసీఆర్ కు కుడి భుజం లాంటి వారు. వారిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారు . పార్టీ కోసం, కేసీఆర్ కోసం రక్తం ధార పోసిన వ్యక్తి హరీష్ రావు. పార్టీ నుండి సస్పెండ్ అయినా కవిత మాటలు అర్థ రహితం.తీవ్రంగా ఖండిస్తున్న..
హరీష్ రావు ఉద్యమం నాటి నుండి నేటి వరకు కెసిఆర్ వెంబడే
ఎమ్మెల్యే గా రాజీనామా చేసి, త్యాగం చేసిన చరిత్ర హరీష్ రావు గారిది. బి ఆర్ ఎస్ పార్టీ కి హరీష్ రావు ఒక చరిత్ర. హరీష్ రావు మొదటి నుంచి పార్టీ లో ఉన్నారు. బేగంబజార్ కి వెళ్ళి జెండా కలర్స్ కూడా అయిన నే తెచ్చారు. మొదటి జెండా దిమ్మె కట్టించింది ఆయన నే. పార్టీ క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి .
పార్టీ కోసం ఒక ఉప ఎన్నికల సమయంలో అస్వస్థతకు గురై ముక్కు నుండి రక్తం వస్తున్న, డాక్టర్ వద్దు అని వాదించిన పార్టీ గెలుపు కోసం పరితపిస్తూ పనిచేశారు. ఉద్యమం సమయంలో న్యూస్ పేపర్స్ వేసుకొని నెల పై చాలా చోట్లా పడుకున్నారు. లక్ష్యం నెరవేర్చడానికి హరీష్ రావు ఒక్క రోజు విరామం తీసుకోలేదు. హరీష్ రావు పై ఎలా మాట్లాడాలని అనిపించిందో ఆమెకి. కవిత వ్యాఖ్యలను తన విజ్ఞత కు వదిలి వేయాలి.
ఇంకోసారి హరీష్ రావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. నీ రాజకీయం కొరకు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వలేదు. ప్రజలకు చాలా చేరువలో హరీష్ రావు పని చేసేది ఆయన నుంచే నేను నేర్చుకున్న.
కాళేశ్వరం కోసం మహారాష్ట్ర కి 25 సార్లు హరీష్ రావు వెళ్లారు. ఏ శాఖ ఇచ్చిన అత్యంత సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరక్షన్ లో కవిత పనిచేస్తున్నంటుంది. పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. అసెంబ్లీ లో హరీష్ రావు ఒంటి చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు.
బీ ఆర్ ఎస్ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని ఆస్వాదిస్తుంటే కవిత విమర్శించడం ఆమె ఏ లైన్లో ఉన్నారో రుజువు చేస్తోంది. కేసీఆర్ కుమార్తె గా కవిత ఎక్కడికి వచ్చినా ప్రజలు స్వాగతం పలికారు. ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోక పోయారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా ? పార్టీలో కవిత ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆమె కు కేడర్ బదులిచ్చింది.
కవితనే కేసీఆర్ కు మచ్చ తెచ్చిందని ప్రజలు భావించారు. కేసీఆర్ నేడు తీసుకున్న నిర్ణయం గొప్పది. కేసీఆర్ అంటే బీ ఆర్ ఎస్ .బీ ఆర్ ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారు . మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ తన ప్రసంగం లో సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఓర్చుకోలేక పోయారు. అందరికీ ఆ సభ నచ్చితే కవిత కు మాత్రం నచ్చలేదు. ప్రజలు ఆమోదించే విధంగా కవిత వ్యవహరించలేదు. కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారు. కాలగమనం లో ఎవరు ఏంటి అనేది అన్ని విషయాలు బయటకు వస్తాయి.
కవితకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. 2001 లో పార్టీ పెట్టినపుడు కవిత లేరు. అసెంబ్లీ లో మాజీ మంత్రి టి .హరీష్ రావు మాట్లాడిన తీరు బీ ఆర్ ఎస్ లోకొత్త ఉత్సాహం తెచ్చింది. ఈ ఉత్సాహాన్ని నీరు గార్చేందుకు కవిత తో కొందరు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారు. కవిత మీద పార్టీ కార్యకర్తలు రగిలిపోయారు. కవిత పై సస్పెండ్ నిర్ణయాన్ని ప్రతీ కార్యకర్త హర్షిస్తున్నారు. సోషల్ మీడియా లో కవిత కు గతం లో మంచి ఫాలోయింగ్ ఉండేది . ఇపుడు అది ట్రోలింగ్ గా మారింది.