– వారు కడుతున్న అమౌంట్ ఎంత ?
– ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే
– పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు
– అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు
– ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి
– విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే
– హోంమంత్రి అనిత స్కూల్లో తిన్న భోజనంలో ప్రత్యక్షమైన బొద్దింక
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి: ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలున్నాయి. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీనరేజీ వసూళ్లుకు మంచి విధానం తెస్తే మాపై విషం కక్కారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సీనరీ వసూళ్లు చేసే బాధ్యతను ఏ ఏం ఆర్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ సంస్థ ప్రతీ రోడ్డులోనూ చెక్ పోస్టులు పెట్టి, ఏ మట్టి ట్రాక్టర్, ఇసుక లారీ, మట్టి బండి వెళ్లినా వాళ్లకు కప్పం కట్టాల్సిందే. వీళ్ల పేమెంట్ చేసేది రెండేళ్లలో రూ.1135 కోట్లు అని వాళ్ల కరపత్రిక లో రాశారు. అందులోనే గత ఏడాది సీనరేజ్ రూ.450 కోట్లు అని రాశారు.
అలాంటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? ఒక కంకర లారీ లోడ్ కు రూ.5010 చెల్లించాలి. ఈ విధంగా దాదాపు రూ.6 కోట్లు ఒక రోజుకు వసూలు చేస్తున్నారు. వారికి ఏడాదికి వస్తున్న ఆదాయం ఎంత? వారు కడుతున్న అమౌంట్ ఎంత ? గతంలో ఎవరైనా ఇంటికి మట్టి తోలుకుంటే డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఇవాళ ఏ ఏం ఆర్ సంస్థకు మాత్రం కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షిత తాగునీటిని అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్యమే.. విద్యార్ధుల మరణానికి కారణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోయారని.. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని తేల్చి చెప్పారు. చనిపోయిన విద్యార్ధుల కుటంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు అధ్వాన్నస్ధితిలోకి నెట్టబడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరణమృదంగాన్ని తలదన్నే పరిస్థితులు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో జూలై నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 11 మంది గిరిజన బిడ్డలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు.
సాక్షాత్తూ ఈ రాష్ట్ర హోంమంత్రి భోజనం చేస్తున్న కంచంలోనే బొద్దింక ఆహారంలో వచ్చింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ 14 నెలల కూటమి పాలనలో అనేక సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో పిల్లలు ఆసుపత్రిలో చేరిన సందర్బాలు ఉన్నాయి. ఇది చేతకాని పాలనకు పరాకాష్ట కాదా? వ్యవస్థను కొద్ది, కొద్దిగా చెదలు తిన్నట్టుగా కూటమి నేతలు తింటున్నారు. దీనంతటికీ కారణం మంత్రి నారాయణ. నారాయణ కాలేజీల సంస్థల చైర్మన్ గా తన సంస్థలను పెంచి పోషించాలన్న దురుద్దేశమే కారణం.
గిరిజన బిడ్డల మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ఒకే ఒక వసతి గృహం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు 135 మంది ఆసుపత్రికి వెళ్లారు. వారిలో నుంచి దాదాపు 25 మందికి పచ్చకామెర్లు ఉన్నట్లు తేలింది. దీనికి కారణం ఆ హాస్టల్ లో ఆర్వో ప్లాంట్ నిర్వహించకుండా, సురక్షిత మంచినీటిని అందించలేకపోవడమే కారణం. చివరికి చిన్నపిల్లలకు మంచినీళ్లు కూడా అందించలేని ఈ చేతకాని ప్రభుత్వం… గొప్పలు చెప్పడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సభలు పెట్టడానికి, వందలసార్లు హైదరాబాద్ కు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి మాత్రం విచ్చలవిడిగా ఖర్చుచేస్తోంది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కొలుకుల స్కూళ్లో, పుల్లలచెరువు స్కూళ్లో ఉపాధ్యాయులు లేరు. 170 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోతే.. 26 మంది మాత్రమే వచ్చారని విద్యాశాఖ అధికారులకు చెప్పాను. అయినా స్పందన లేదు.